Teluguwonders:
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే…
🎊అర్ధరాత్రి నుంచే పండుగ మొదలయ్యింది :
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేసారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులన్నీ మొదలయ్యాయి. ఇక, ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం.. పవన్ డీపీలు, ఫ్లెక్సీలు ఇలా రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
🔴హీట్ ని పెంచేసిన రామ్ చరణ్:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఎంతో ఘనంగా చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక, పవన్ పుట్టినరోజును కూడా అదే స్థాయిలో నిర్వహించడానికి ఫ్యాన్స్ సిద్ధం అయ్యారు . వీరిని మరింత ఉత్సాహ పరచడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కామన్ డీపీని విడుదల చేసిన సంగతి విధితమే.
🌟నెంబర్ వన్ స్థానంలో పవన్ :
ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అయ్యారు. ఆయన పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత #happybirthdaypowerstar మూడో స్థానంలో, #HappyBirthdayJanasenani నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
💥37 నిమిషాల్లోనే :
ఇక, #HappyBirthdayPawanKalyan ట్యాగ్ పెట్టిన 37 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. ఇలా మరే హీరోకూ ఇప్పటి వరకు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేందుకు ఇటీవల చిరంజీవి పుట్టినరోజున కూడా ఈ రేంజ్‌లో ట్వీట్లు పెట్టలేదని అంటున్నారు.ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఆయన ట్రెండ్ అయ్యారు. ఆయన పేరుతో రూపొందించిన #HBDEvergreenMegaStar ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత #HBDMegaStarChiranjeevi రెండో స్థానంలో, #SyeRaaNarasimhaReddy మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. అలాగే, #MegaStarBirthday ఐదో స్థానంలో ఉంది. అంటే టాప్ 10లో చిరంజీవి ట్యాగ్స్ నాలుగు ఉండడం విశేషం.
చిరంజీవి క్రేజ్ ఖండాంతరాలను దాటిన విషయం తెలిసిందే. అందుకే విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సైతం తమ అభిమాన హీరో పుట్టినరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. దీంతో ట్విట్టర్‌లో వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లోనూ #HBDMegaStarChiranjeevi ట్యాగ్ 23వ స్థానంలో కొనసాగుతోంది.ఇప్పుడు ఈ రికార్డు ను పవన్ 37 నిమిషాల్లో చేరిపెయ్యడం తో… పవన్ కల్యాణ్ క్రేజ్‌ను తెలుపడానికి మరో ఉదాహరణగా దీనిని అభివర్ణిస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.