Latest

    ‘కులం’ పిచ్చిలో ప్రభాస్ ను ఇరికించిన వర్మ

    Verma, who inscribed Prabhas in the 'caste' madness

    Teluguwonders:

    రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రెస్. ఎప్పుడూ వివాదాలను క్రియేట్ చేస్తూ ఆ పబ్లిసిటీ లో తేలియాడుతూంటాడు వర్మ. అందుకే వర్మను చాలామంది పట్టించుకోవటం మానేశారు. ఎంతో క్రియేటివిటీ బ్రెయిన్ తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీస్తున్నా మునుపటి ఫాం అయితే లేదు. అయితే.. గతంలో అతను సృష్టించిన సెన్సేషనే నేటికి అతని ఉనికిని కాపాడుతుందనేది నిజం. ఈరోజు రామూ మరో వివాదానికి తెరతీసాడు.

    ప్రస్తుతం వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను రాజకీయ కోణంలో తీస్తున్నాడని ఇప్పటికే ప్రకటించాడు. టైటిల్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా సినిమాలో అవేమీ ఉండవని కేవలం వ్యక్తుల మధ్యే ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు.

    అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో క్యాస్ట్ మీద పాట రిలీజ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ లో వీడియో రూపంలో విడుదల చేశాడు. “నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి. ఈ సందర్భంగా నా నెక్స్ట్ సినిమా కమ్మరాజ్యంలో కడప రడ్లులోని ఒక పాటని 27వ తారీఖు ఉదయం 9గం.27 నిముషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం” అంటూ సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

    ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్. ప్రభాస్ అంటే ఇష్టమైనవారు చాలామంది ఉంటారు. ఎవరూ ఇంతవరకూ క్యాస్ట్ పరంగానే అతన్ని చూస్తున్నామన్న స్పృహ ఉండదు. కానీ వర్మ పెట్టిన ఈ పోస్ట్ తో క్యాస్ట్ ను ఓపెన్ గా చెప్పేసి ప్రభాస్ ను ఓ వర్గానికి పరిమితం చేశేసాడు. ఇది రామూ స్వంత ఆలోచనే అయినా పబ్లిక్ గా పోస్ట్ చేయడం ఎంతవరకూ కరెక్టో ఆయనే తేల్చుకోవాలి. ఈ పాట మరెన్ని సంచనాలు సృష్టించనుందో చూడాలి.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading

    Subscribe