సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా రేంజ్ కన్నా మించిపోతాడు అంటున్న S.S. రాజమౌళి

'Saho' ticket rate in Prabhas' own home town
Spread the love

Teluguwonders:

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సాహో సినిమా ప్రచారంలో భాగంగా..ఎవ్వరూ ఊహించనంత ఘనంగా.. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి రాజమౌళి, వి.వి.వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కృష్ణంరాజు లాంటి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

👉🎙సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి:

రెబల్ స్టార్ ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..; ‘‘ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ, ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్టవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజూ ఎవరి గురించీ చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంత మంది ఫ్యాన్స్‌ని తెచ్చిపెట్టింది. ప్రభాస్‌కి చాలా దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ కథ చెప్పినప్పుడే తాను తన తరవాత సినిమా ఏంటి అనే ఆలోచన మొదలుపెట్టాడు. చాలా తపన పడ్డాడు. ‘బాహుబలి’ తరవాత ఏం సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి నన్ను పదేపదే అడుగుతా ఉండేవాడు.

ఒక రోజు ప్రభాస్ చాలా ఎక్సైటెడ్‌గా నా దగ్గరకు వచ్చాడు. సుజీత్ వచ్చి కథ చెప్పాడు డార్లింగ్.. అద్భుతంగా ఉంది అని చాలా చాలా ఆనందంగా చెప్పాడు. నాకు మొదట నచ్చిన విషయం ఏంటంటే.. ఒక పెద్ద సినిమా చేసిన తరవాత ఇంకా పెద్ద డైరెక్టర్‌తో చేయాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి అని కాకుండా, కథను నమ్మి చేశాడు. ‘బాహుబలి’ తరవాత ఇలాంటి సినిమా అయితే జనాలకు నచ్చుతుంది, నా ఫ్యాన్స్‌కి నచ్చుతుంది అని నమ్మి చేశాడు. ఇదే ‘సాహో’కి ఒక మంచి సూచికం.
సుజీత్ వయసు చాలా తక్కువ. చిన్న కుర్రాడు. చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా లేదా అని. నాకు తెలిసి టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అర్థమైపోయి ఉండాలి. టీజర్, ట్రైలర్ తరవాత సుజీత్ సామర్థ్యం ఏమిటో అందరికీ అర్థమైపోయింది. నిజంగా అంత మంది పెద్ద టెక్నీషియన్స్‌ని, అంత పెద్ద బడ్జెట్‌ని, ప్రభాస్ లాంటి ఆలిండియా స్టార్‌ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. సుజీత్ ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్‌లా హ్యాండిల్ చేశాడు. సుజీత్ భుజాలపైనే సినిమా నిలబడింది. సుజీత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ప్రభాస్ ఏమడిగితే అది చేసేస్తారు. ఏమడిగితే అది ఇచ్చేస్తారు. ప్రభాస్ అంటే వాళ్లకు అంత ఇష్టం, అంత నమ్మకం. సినిమా మీద చాలా ఖర్చుపెట్టారు. చాలా ధైర్యం కావాలి ఇలాంటి సినిమా చేయడానికి. నాకు కచ్చితంగా నమ్మకంగా ఉంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ప్రమోద్, వంశీలకు వాళ్ల పెట్టిన డబ్బుల కంటే డబుల్, ట్రిపుల్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ ఇప్పటికే ఆలిండియా స్టార్. అక్కడి నుంచి అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మొత్తం టీం అందరికీ అభినందనలు.అందరూ చాలా కష్టపడ్డారు. సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సుధీర్ఘంగా మాట్లాడారు.. ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 👉తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి తన గురించి మాట్లాడుతుంటే
ప్రభాస్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

💥సాహో కోసం అభిమానుల ఎదురుచూపులు:

ఒకప్పుడు ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభిమానులు ఉండేవారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టారు రాజమౌళి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ‘సాహో’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading