Teluguwonders:
ఇండస్ట్రీని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు. ఆయన ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో వైసిపికి మద్దతుగా నిలిచారు. ఆయనే కాదు ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన పలువురు సీనియర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వైసిపికి మద్దతుగా నిలిచారు. చాలామంది వైసిపి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
👉జీవిత రాజశేఖర్ దంపతులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్, పోసాని కృష్ణమురళీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. ఎన్నికలు ముగిశాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
🔴వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారికి నో ఛాన్స్ :
వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారిలో కొందరికి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదన్న టాక్ బయటికి వచ్చింది.
👉గతం లో పృధ్విని :
ముందుగా బన్నీ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విని ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారట. ఇప్పుడు బన్నీ ఒత్తిడితో ఆ క్యారెక్టర్‌ను తీసేశారని దీంతో త్రివిక్రమ్ పృధ్వీకి సినిమాలో రోల్ లేదని సున్నితంగా చెప్పారని వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం పృధ్వి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పోసాని మాట్లాడుతూ ఏపీలో ఉన్న నాయకుల్లో తనకు జగన్ నచ్చారని.. టీడీపీ మద్దతుదారులే ఎక్కువుగా ఇండస్ట్రీలో ఉన్నారని.. అందుకే తనకు సహజంగానే అవకాశాలు తగ్గుతాయని కూడా అన్నారు.
🔴ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు :
ఓ అగ్ర నిర్మాత నిర్మించే చిత్రంలో ముందుగా లిస్టులో తన పేరు కూడా ఉందని… ఆ తర్వాత తనను తీసేశారని ఆయన ఆరోపించారు. ఆ అగ్ర నిర్మాత ఎవరో కాదు అశ్వనీదత్ అంటూ పోసాని కామెంట్స్ చేశారు.
ఎన్నికల టైంలో పోసానితెలుగుదేశం పార్టీని…. చంద్రబాబు ను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ తరఫున మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అదే టైంలో . ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న పోసాని తాను ఎన్నికల్లో చంద్రబాబుని… టిడిపిని తిట్టడంతో సినిమాలనుంచి తీసేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.