Teluguwonders:
పూరి జగన్నాధ్ బిజినెస్‌మేన్ మూవీ తర్వాత మహేష్ బాబుతో ‘జన గణ మన’ అనే సినిమా చేయాలనుకున్నారు. కారణాలేమైనా మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదే కథను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదే నిజమైతే తెలుగులో త్వరలో మరో సంచలన సినిమా రాబోతోంది.
💥రౌడీ స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్:
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ తెరకెక్కబోతోంది. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత ఛార్మీ కౌర్ ట్వీట్ చేశారు.
🔴దేవరకొండ ఫ్యాన్స్‌లో ఉత్సాహం :
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు పూరి జగన్నాధ్, చార్మి అఫీషియల్‌గా ప్రకటించగానే ఇటు పూరి అభిమానులతో పాటు అటు దేవరకొండ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పొంగిపొర్లింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో మంచి ఊపుమీదున్నాడు పూరీ జగన్నాథ్… విజయ్ దేవరకొండతో అంతకు మించిన మాస్ మూవీని తెరక్కించే ప్లాన్లో ఉన్నాడు. ఇందు కోసం పూరీ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
🔴మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా విజయ్:
పూరి సినిమా అంటేనే దుమ్మురేపే డైలాగులు ఉంటాయి. విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ డెలీవరీ తీరుకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో మాత్రం అతడి కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను రాశారని, ఇందులో విజయ్ మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా కనిపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
పూరి, విజయ్ దేవరకొండ సినిమా మొదలయ్యేది ఎప్పుడు? హీరోయిన్ ఎవరు? ఇతర విశేషాలు ఏమిటి అనే అంశంపై త్వరలో క్లారిటీ రానుంది. అయితే కాంబినేషన్ కలిసి చేయడం వల్ల టాలీవుడ్లో ప్రేక్షకుల్లో రాబోయే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ కావడం ఖాయం.
🔴గర్వంగా ఉంది : చార్మి
ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించబోతున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బేనర్లో పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ రాబోతోంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్లు చార్మి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుండటం ఎంతో గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.