సాహో విషయంలో ప్రభాస్ పై కోపంగా ఉన్న రాజమౌళి..!!?

Rajamouli is angry with Prabhas about Saaho
Spread the love

Teluguwonders:

రాజమౌళి ముందే చెప్పాడట..ప్రభాస్ వినలేదట.. అయినా రాజమౌళి తనకు అంత నమ్మకస్తుడు అయినప్పుడు ప్రభాస్ ఆయన మాట ఎందుకు వినలేదు? ఏం వినలేదు ? ఎందుకు వినలేదు ? సుజిత్‌పై నమ్మకంతోనా? లేక సినిమా ఎలాగో వసూళ్లు రాబడుతుందన్న ధీమాతోనా? ఏదైతేనేం..మొత్తానికి సాహో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది .
సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎటూ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా తన తదుపరి సినిమా చిత్రీకరణపై ఫోకస్ చేస్తున్నారట.

🌟ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా సాహో :

సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ విలన్ పాత్రలో, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, ఎవ్లిన్ శర్మ సహాయ పాత్రల్లో నటించారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఐదు రోజుల్లో సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.350 కోట్లు కలెక్షన్ల రూపంలో వచ్చేశాయి.

💥కానీ రాజమౌళి చెప్పిన మాట వినుంటే :

పెద్దల మాట పెడచెవిన పెట్టరాదు అని ఊరికే అనలేదు.సాహో విషయంలో రాజమౌళి చెప్పిన మాట వినుంటే సక్సెస్ మరో రేంజ్‌లో ఉండేదట.

👉 అసలు విషయమేంటంటే..:

‘సాహో’ సినిమా రన్ టైం 150 నిమిషాలు ఉంది. ఒక తెలుగు సినిమా ఇంతటి నిడివి కలిగి ఉండటం ఇదే మొదటిసారేమో. ఇది సినిమాకు మైనస్ పాయింట్‌గా మారుతుందని దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సాహో బృందానికి ఎప్పుడో చెప్పారట. సాహో సినిమా విడుదలకు ముందు రాజమౌళి స్పెషల్ స్క్రీనింగ్‌ చూశారు.
రన్ టైం ఎక్కువగా ఉంది.. తగ్గిస్తే బాగుంటుందని ప్రభాస్‌కు సూచించారు. కానీ సినిమాకు అది అవసరమేనని ప్రభాస్ ఆయన మాటల్ని పెడచెవిన పెట్టారు. అంతేకాదు..

👉రొమాంటిక్ సినిమా చేస్తే బాగుంటుందని :

‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత నేరుగా యాక్షన్ సినిమా చేస్తే ప్రేక్షకులకు రుచించదని, ఏదన్నా రొమాంటిక్ సినిమా చేస్తే బాగుంటుందని కూడా చెప్పారట. ప్రభాస్ మాత్రం సాహో తీసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నారు.

🔴రాజమౌళికి కోపం వచ్చిందా..? :

ఏదన్నా ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే దాని గురించి రాజమౌళి కచ్చితంగా సోషల్ మీడియాలో చర్చిస్తారు. కానీ తనకు సోదరుడిలాంటివాడైన ప్రభాస్ నటించిన సినిమా గురించి మాత్రం రాజమౌళి ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రభాస్ తన మాట విననందుకు రాజమౌళికి కోపం వచ్చిందని అందుకే సినిమాకు ప్రచారం కల్పించదలచుకోలేదని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వివాదం కారణంగా మున్ముందు ప్రభాస్‌తో కలిసి రాజమౌళి సినిమా చేసేందుకు ముందుకు వస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading