Teluguwonders:
రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, సినిమాను ఎక్కడా ఫ్లాట్ కానివ్వకుండా చూసుకుంటాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో సినిమా సినిమాకు తన అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సుబ్బు చేశాడు. దీంతో ఈ మూవీ దారుణంగా ఫెయిల్ అయ్యింది.
దీని తరువాత మరలా రాజమౌళితోనే సింహాద్రి సినిమా చేశాడు:
సింహాద్రి బంపర్ మాస్ హిట్. సింగమలై గా ఎన్టీఆర్ చేసిన సాహసం అంతాఇంతాకాదు. ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమా తరువాత హిట్ మీదున్న పూరితో ఎన్టీఆర్ ఆంధ్రావాలా చేస్తే బెడిసికొట్టింది. ఆ తరువాత చాలాకాలం హిట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్.. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా యమదొంగ. ఈ మూవీ విజయం తరువాత మరలా అదే సీన్ రిపీట్ అయ్యింది.
కాగా, అటు నితిన్ కెరీర్లో మంచి హిట్ అందుకున్న సై సినిమా తరువాత చేసిన అల్లరి బుల్లోడు భారీ ప్లాప్. సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమా తరువాత సునీల్ పరిస్థితి కూడా అంతే. వరస ప్లాప్ లతో సునీల్ అల్లాడాడు. చివరకు తిరిగి కమెడియన్ గా సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు ఈగ తరువాత నాని పరిస్థితికూడా లాగే మారిపోయింది. ప్రభాస్ మొదట రాజమౌళి ఛత్రపతి సినిమా తీశాడు. ఆ సినిమా ఒక రేంజ్ లో హిట్టైంది. ఆ సినిమా తరువాత ప్రభాస్ చేసిన పౌర్ణమి సినిమా భారీ ప్లాప్. ఇప్పుడు బాహుబలి సీరీస్ చేశారు. ఈ రెండు బంపర్ హిట్ .. ఆ తరువాత వచ్చిన సాహో పరిస్థితి ఎలా మారిపోయిందో తెలిసిందే. రాజమౌళి సినిమా తరువాత ఆ హీరో రేంజ్ పెరిగిపోవడం.. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో సినిమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతూ వస్తున్నది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.