దసరాకి రానున్న రాజుగారిగది…భయపెడుతున్న ఫస్ట్ లుక్

Spread the love

Teluguwonders:

హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్ గా రష్మీని తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అవికా గోర్ తో కూడిన ఫస్ట్ లుక్ ను ఏఒర్జు రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్.

ఈలుక్ లో కాస్త భయంకరంగానే కనిపించింది ఈ బెంగాలీ భామ. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అవికా ఈమధ్య గ్యాప్ తీసుకుంది. .తెలుగులో అవికా చేసింది కొన్ని సినిమాలే వాటిలో హిట్స్ ఉన్నాయి. అయితే ఆ క్రెడిట్ ఆమెకు దక్కలేదు, ఆఫర్స్ రాక సినీ కెరీర్ ఆపేసి చదువు పేరుతో సొంతూరు వెళ్ళిపోయింది.

ఇక ఆ భామని ఓంకార్ ఒప్పించి మరీ ఈ సినిమా చేయిస్తున్నాడట. ఎటూ వెతుక్కుంటూ వచ్చిన అవకాశమే కాబట్టి ఇప్పుడు రాజుగారి గది-3తో మళ్లీ బిజీ కావాలని చూస్తోంది. అన్నట్టు ఈ భామ ఇదివరకే ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హారర్ థ్రిల్లర్ లో నటించింది. కానీ ఆమె మరణం తర్వాత ఆత్మగా మారుతుంది కాబట్టి ఆమె దెయ్యంగా భయపెట్టలేదు, ఈ సినిమాతో ఆ లోటు తీర్చనుంది. ఇక దసరా కి సినిమా రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించింది సినిమా యూనిట్.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading