Teluguwonders:
ఇద్దరు మహిళలు ముద్దు పెట్టుకోవడం మొన్నటి వరకూ బాలీవుడ్ హాలీవుడ్‌లలోనూ చూశాం.. ఇప్పుడు ‘మన్మథుడు 2’ చిత్రంతో ఆ ముచ్చటను తీర్చేసుకుంటున్నారు రకుల్, ఝాన్సీలు. ఇంకా ఈ చిత్రంలో ఎలాంటి సిత్రాలు ఉన్నాయో రేపు థియేటర్స్ లో..చూడాలి. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘మన్మథుడు 2’ భారీ అంచనాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
💗నేనింకా నవ మన్మథుడినే :
60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం స్టిల్ నవ మన్మథుడినే అంటున్నారు. ఆయన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్‌తో వస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌తో రేపు (ఆగస్టు 08) ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉మన్మథుడు2 :
అయితే ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లో మన్మథుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. 60 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడిగా లిప్ లాక్‌లు చేస్తూ మోడల్స్‌తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేశాడు. అయితే ఈ సినిమాలో నాగార్జునే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముద్దు రుచి చూసిందట.
అయితే కింగ్ నాగార్జునతో లిప్ లాక్ చేస్తే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేనేలేదు. అయితే ఆమె కిస్ చేసింది నాగార్జునని కాదట.. యాంకర్ ఝాన్సీతో లిప్ లాక్ రుచి చూసిందట. ఈ ముద్దులో గాఢత ఎక్కువుగానే ఉండటంతో సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని సెన్సార్ వాళ్లు చురకలు వస్తే.. ఆ ముద్దు సీన్‌ను బ్లర్ చేయమని U/A సర్టిఫికేట్ ఇచ్చారు.
అంతేకాదు ఈ సినిమాలో F***తో మొదలయ్యే బూతులు చాలా ఉండటంతో పాటు కులాల ప్రస్తావన కూడా ఉండటంతో వాటికి బీప్ సౌండ్ వేయాలని మొత్తంగా 9 కట్స్‌తో సెన్సార్ చేశారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.