Teluguwonders:
హీరో శర్వానంద్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సినిమాకు ఆయన వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్‌లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘రణరంగం’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రెండు కాలాల్లో ఈ సినిమా కథ సాగుతుంది. శర్వానంద్ కూడా రెండు డిఫరెంట్ షేడ్‌లలో కనిపించనున్నారు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
🔴జోరుపెంచిన చిత్ర యూనిట్ :
రణరంగం’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహాయంతో సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
🔴రామ్ చరణ్ ప్రమోషన్ :
‘‘రణరంగం సౌండ్ కట్ టెర్రిఫిక్‌గా, చాలా కొత్తగా ఉంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా సూపర్బ్‌గా ఉంది. శర్వాను మళ్లీ ఎలాగైతే మేం చూడాలనుకున్నామో ఈ సినిమాలో అలా ఉన్నాడు. గత చిత్రాల్లో శర్వా నటన అద్భుతంగా ఉంది. శర్వాలో ఉన్నది.. నాకు నచ్చింది ఆ ఇంటెన్సిటి. ‘కో అంటే కోటి’ శర్వా సినిమాల్లో నాకెంతో ఇష్టమైనది. దానిలో ఉన్న ఇంటెన్సిటీ మళ్లీ మరో మంచి కథతో పడితే చాలా బాగుంటుందని అనుకున్నాను. ‘రణరంగం’ అదే ఇంటెన్సిటీని ప్రేక్షకులకు అందిస్తుంది. ప్లాట్ చాలా చాలా బాగుంది. ఈ సినిమాతో సుధీర్ వర్మ హిట్ కొడతారు. పిళ్లై మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్‌గా ఇచ్చారు. ఇలాంటి కొత్త కథ కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని రామ్ చరణ్ అన్నారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్‌ను తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌ను చూసిన చరణ్.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాలా కొత్తగా ఉందని అన్నారు. ఈ సౌండ్స్ చూస్తుంటే థియేటర్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందనిపిస్తుందని కొనియాడారు.
👉తాజాగా ‘రణరంగం’కు రామ్ చరణ్ ఇచ్చిన ప్రోత్సాహం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా ఉంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.