Teluguwonders:
ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్‌గా దక్షిణాది సినిమాలో ఓ వెలుగు వెలిగి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన లేడీ లయన్ జయలలిత. దాదాపు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేసిన పురచ్చి తలైవి.. తన అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఒక ప్రముఖ వ్యక్తిపై ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఒక బయోపిక్ మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్ విషయంలో రెండు వచ్చాయి. కానీ, ఇప్పుడు జయలలిత జీవితానికి సంబంధించి బయోపిక్‌ల మీద బయోపిక్‌లు వస్తున్నాయి
🔴ఆ పాత్ర కోసం క్యూ లో ముగ్గురు దర్శకులు :
అయితే, జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆమె బయోపిక్‌ను తెరకెక్కించడానికి చాలా మంది దర్శకులు సిద్ధమైపోయారు. 👉 కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశి లలిత’ పేరిట బయోపిక్ చేస్తున్నారు. అలానే, 👉తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తున్నారు. 👉తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు.
🎬గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం లో :
ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ జయలలిత జీవితంపై కల్పిత వెబ్ సిరీస్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లీడ్ రోల్‌ను ప్రముఖ నటి రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ‘క్వీన్’ ప్రీమియర్ తేదీని ప్రకటిస్తారు.
👉ఎంఎక్స్ ప్లేయర్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.