Teluguwonders:
బుల్లితెరపై మంచి ఫామ్‌లో ఉంది అనసూయ. వాస్తవానికి అనసూయ సినిమాల్లోనూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది.
🔴రంగమ్మత్తగా :
ఆమె ‘క్షణం’తో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో అనసూయ యాక్టింగ్ మెప్పించింది. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మ్యాజిక్ చేసింది. మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించింది.
💙రష్మీ :
మరో యాంకర్ రష్మీ.. అనసూయతో పోలిస్తే ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు చెప్పుకోదగ్గ హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాను మాత్రం తన గ్లామర్‌తోనే నిలబెట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. దానికి కారణం రష్మీనే అన్న విషయం అందరికీ తెలిసిందే.
అనసూయ, రష్మీకి భారీ ఎదురుదెబ్బ..ఇది
తెలుగు బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో సుమ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. ఇద్దరూ తమ తమ లక్ష్యాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, ఫేమస్ కామెడీ షో ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకున్నప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవడం లేదు. ఈ షోలో తలో ఎపిసోడ్‌ను పంచుకున్న ఈ భామలిద్దరూ అభిమానులను కూడా అదే స్థాయిలో సంపాదించుకున్నారు. అయితే, తాజాగా తెలుగు ప్రేక్షకులు ఈ ఇద్దరు భామలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
రష్మీ, నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ప్రధాన పాత్రధారులుగా, నల్లా స్వామి సమర్పణలో, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘శివరంజని’. హారర్ కమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి నాగ ప్రభాకర్ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. అంతేకాదు, అస్సలు పట్టించుకోనే లేదు. దీంతో రష్మీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.
అనసూయ తాజా చిత్రం ‘కథనం’. ఇందులో ఆమె రైటర్ పాత్రలో నటిస్తుంది. ఆమె రాసిన కథ బయట జరుగుతుంది. A film by aravind గుర్తుంది కదా..ఆ సినిమా లో గజల్ శ్రీనివాస్ రాసిన కథే బయట కూడా జరుగుతుంటుంది. ఇక్కడ కూడా కథలో మర్డర్ జరుగుతుందని రాస్తే.. బయట కూడా జరుగుతుంది. ఆ మర్డర్ మిస్టరీ చుట్టూ కథనం కథ అల్లుకున్నాడు దర్శకుడు రాజేష్ నాదెండ్ల. రెండు రోజుల క్రితమే వచ్చిన ఈ సినిమాకూ టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ ఇచ్చారు.
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైమ్‌లో వచ్చిన ఈ చిత్రం నిరాశకు గురి చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.