Teluguwonders:
RX 100 చిత్రంతో కుర్రకారు మదిని కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ ‘RDX Love’. ఈ ప్రమోషన్స్ వర్క్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
🔥‘RDX Love’ టీజర్ ఓ బూతు పురాణం:
పాయల్!! ఈ ‘RX 100’ పిల్లను ‘RDX Love’ టీజర్, పోస్టర్‌లలో చూసి బాప్ రే అనుకున్నారంతా. ఇందులో ఆమె చెప్పిన బూతు పురాణం చూస్తే ఇదేదో కండోమ్ ప్రొడక్ట్‌కి ప్రమోషనల్ యాడ్‌లా ఉందే తప్ప టీజర్ లా లేదు అనే కామెంట్స్ వినిపించాయి. నిజానికి ‘RDX Love’ టీజర్ కూడా అలానే ఉంది.
🔵RDX Love’ టీజర్ :
‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబోటులో ఉంచుకోవాలి’.. అంటూ సేఫ్టీల వాడకం గురించి తెగ చెప్పింది పాయల్. అంతేనా.. ‘మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?’ అంటూ అర్ధరాత్రి పూట తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పోలీసులకు దొరికిన పాయల్‌ని.. ఎక్కడ నుండి వస్తున్నావ్ అని అడిగితే.. ‘నా బాయ్ ఫ్రెండ్ సేఫ్టీ కావాలంటే తీసుకువస్తున్నాను’ అంటూ పచ్చిగా నిస్సిగ్గుగా చెప్పేయడంతో పాటు మితిమీరి అందాలను ప్రదర్శించడం.. మంచాలు విరిగిపోవడం లాంటి బూతు బాగోతాలు చూస్తే కండోమ్ యాడ్‌కి మించిన రేంజ్‌లో ఈ టీజర్ ఉంది.
👉పద్దతిగా ఉన్న ట్రైలర్ :
అయితే రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అందాల ఆరబోత, బూతు కంటెంట్ జోలికి పోకుండా హీరోయిన్ ఓరియెంటెడ్‌గా కథను రివీల్ చేసే ప్రయత్నం చేశారు. పాయల్ గ్లామర్ రోల్ నుండి ఇంపార్టెన్స్ రోల్‌కి షిఫ్ట్ అయ్యింది. నిమిషం నిడివితో ఉన్న ట్రైలర్‌లో ఒక ఊరి సమస్యను తీర్చే మోడరన్ వనితగా పాయల్ రిస్క్ చేస్తుంది.
💥 డైలాగులు దంచేసింది :
‘వేటాడాలనుకుంటున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు. అదే.. వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అంటూ కండల తిరిగిన మగాళ్లను వీర కుమ్ముడు కుమ్మేస్తోంది. అంతేకాదు.. ‘అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బ్రతిమాలండి.. కరిగిపోతారు. అబద్దం చెప్పి బాధ పెట్టకండి. కరిగించేస్తారు’ అంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చేస్తోంది. 👉చూద్దాం Rx100 లా ఈ సినిమా కూడా పాయల్ కి సూపర్ హిట్ ని ఇస్తుందేమో.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.