Teluguwonders:
ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30 వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో భారీ అంచనాలతో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. కానీ సాహో సినిమా రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో నెగిటివ్ టాక్ వచ్చినా వీకెండ్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి.
సాహో సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 125 కోట్ల రుపాయలకు అమ్మారు. మొదటి వారం ఈ సినిమాకు 75 కోట్ల రుపాయల కలెక్షన్లు వచ్చాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కావాలంటే సాహో సినిమా మరో 50 కోట్ల రుపాయలు వసూలు చేయాల్సి ఉంది.
కానీ మొదటి వారం తరువాత సాహో సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా డ్రాప్ అయ్యాయి. 12 రోజుల్లో సాహో సినిమా 78.92 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది.
సాహో తెలుగు రాష్ట్రాల్లో పుల్ రన్లో 85 కోట్ల రుపాయల షేర్ దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సాహో సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. హిందీలో మాత్రమే సాహో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయి. మరో రెండు రోజుల్లో గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల కాబోతూ ఉండటంతో సాహో సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
సాహో సినిమా తరువాత ప్రభాస్ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు 180 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా 1960 యూరప్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని సమాచారం. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 25 శాతం పూర్తయిందని సమాచారం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.