Teluguwonders:
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ప్రభాస్ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని భావించే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్షమంది పట్టే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇక వేడుక ప్రారంభమైన తరవాత ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కులు చూపించారు.
💥వివరాల్లోకి వెళ్తే :
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈనెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేందుకు ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 👉ప్రస్తుతం ట్విట్టర్ టాప్ ట్రెండ్‌లో ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. కాగా, ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ‘సాహో’లోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఒళ్లో శ్రద్ధా కపూర్ కూర్చొని ఆయన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె చేతిలో గన్‌తో రొమాంటిక్‌గా చూస్తోంది
🔴‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
వల్ల ఆర్‌ఎఫ్‌సీ జనసంద్రమైన సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రభాస్ అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. కొంత మంది భారీకేడ్లను పడగొట్టుకుని ముందుకు వచ్చేసారు. వీరిని కంట్రోల్ చేసేందుకు యాంకర్ హేమంత్ పదే పదే మైక్‌లో విజ్ఞప్తి చేశారు. పోలీసులకు సహకరించాలని, ఎవ్వరూ బారికేడ్లు తోయకూడదని వేడుకున్నారు. హీరో ప్రభాస్ అందరికీ కనిపించేలా నిలబడి మాట్లాడతారని చెప్పారు. ఇక పోలీసులు డ్రోన్ కెమెరా ఆపరేటర్ తమతో టచ్‌లో ఉండాలని సూచించారు. డ్రోన్ కెమెరాతో పరిస్థితిని తమకు చూపిస్తే ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయడం వీలుపడుందని యాంకర్ హేమంత్‌కు తెలియజేశారు.
🔴ట్విట్టర్ ద్వారా ప్రభాస్ సూచనలు :
మరోవైపు ప్రభాస్ ట్విట్టర్ ద్వారా మిగిలిన అభిమానులకు సూచనలు చేసారు. పోలీసులతో సహకరించి వేడుక ప్రశాంతంగా జరిగేలా తోడ్పాటును అందించాలని ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.