Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది.‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు.
🛡Making of saho : ఈ సినిమా ప్రారంభానికి ముందు Making of saho అనే ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు.
🎊వహ్వా అనిపించిన Saaho teaser : తాజాగా సాహో సినిమా టీజర్‌ను.. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ .
🎊టీజర్ హైలైట్స్ :సాహో టీజర్ కాక రాజేసింది. చాలా ఇంటెన్స్‌గా, అద్భుతంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ టీజర్ ఓ రేంజ్లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాహూ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ‘సాహో’ ఉండబోతోందని teaser ద్వారా తెలిసిపోతోంది.
🎉సినీ ప్రముఖుల ప్రశంసలతో దద్దరిల్లిన సోషల్ మీడియా : ఈ టీజర్ చూసిన సినీ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
👉రాజమౌళి విషెస్ :యూవీ క్రియేషన్స్ వారు బడ్జెట్ కి న్యాయం చేస్తే.. డైరెక్టర్ సుజీత్ తన రెస్పాన్సిబిలిటీ కి న్యాయం చేశాడు. టెర్రిఫిక్ టీజర్. ప్రభాస్ యాక్షన్ అదిరిపోయింది.. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ సుజిత్, శ్రద్దాకపూర్, యూవీ క్రియేషన్స్, సాహో చిత్ర యూనిట్‌కి నా అభినందనలు.
👉 సాహూ టు ప్రభాస్..అని ప్రశంసించిన నాగార్జున : తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం రానుంది. ఆల్ ది బెస్ట్ సాహూ టీం అని నాగార్జున తన సంతోషం వ్యక్తం చేశారు.
👉తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరో చారిత్రాత్మక సినిమా :
దేశంలోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరో చారిత్రాత్మక సినిమా రాబోతున్నది. హాలీవుడ్ స్ఠాయికి తగినట్టుగా సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. సాహో సినిమాను చూడటానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు రెడీగా ఉండండి అని అల్లు శిరీష్ ట్వీట్ పెట్టాడు.
👉 శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారి ట్వీట్ :Saaho teaser ఫెంటాస్టిక్ గా ఉంది. హీరో ప్రభాస్‌కి, డైరెక్టర్ సుజిత్‌కి, యూవీ క్రియేషన్స్, సాహో చిత్ర యూనిట్‌కి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారు ట్వీట్ చేశారు.
👉సాహూ టీజర్ ఇన్స్పైరింగ్ :సాహూ టీజర్ ఇన్స్పైరింగ్గా ఉంది. యాక్షన్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆధ్బుతంగా ఉన్నాయిఅని సినీ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు.ఇంకా ఇంక్రిడబుల్.. సూపర్ అంటూ ప్రభాస్ సాహూ ఎమోజీ పోస్ట్ చేశారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ * ఇలా చాలా మంది టీజర్ పై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
👉అందరూ పిచ్చ వెయిటింగ్ : రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్.. ఓవర్ నైట్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమాలపై అన్నిభాషలకు సంబంధించిన ఇండస్ట్రీ వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.