Teluguwonders:
ప్రభాస్‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
🔴 ‘సాహో’ ట్రైలర్ టాక్..:
సుజిత్ దర్శకత్వంలో… ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. . తాజాగా సాహో సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.2 నిమిషాల 46 సెకన్లు ఈ ట్రైలర్ ఉంది.
అంతేకాదు ప్రభాస్ ఏదైతే నమ్మకం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేసినట్టే ఉంది ఈ ట్రైలర్ చూస్తుంటే.. విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా ముంబాయిలో రూ.2000 కోట్లను ఎవరో దొంగలిస్తారు. అది దొంగతనం చేసింది ఎవరు ? హీరో ఈ దొంగతనం చేసాడా ? ఎవరు చేసారు ? శ్రద్దా కపూర్ ఈ సినిమా అమృతా నాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ముంబాయిలో దొంగతనం చేసిన వాళ్లను పట్టుకునే పనిలో ఉంటుంది. మరోవైపు ప్రభాస్, శ్రద్దాల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది అనే డైలాగులు బాగున్నాయి. విజువల్స్ పరంగా ‘సాహో’ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.
☸ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టాండర్డ్స్ :
ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి 200 కోట్లు బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ‘ తెలుగులో ఇప్పటి వరకు విజువల్ గ్రాండియర్స్ ఎలా ఉంటాయో మన దర్శకులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. రన్ రాజా రన్’తో ఆకట్టుకున్న సుజీత్.. సాహోతో సంచలనం సృష్టించడం ఖాయం అని ఈ ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు.
👉ఈ సినిమాతో ’ ప్రభాస్ మరోసారి దేశ వ్యాప్తంగా ‘సాహో’ అనిపించేలాగే ఉన్నాడు.చూద్దాం..ఏమవుతుందో.
🔴అందుకే లేట్ :
ఈ సినిమాను ముందుగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉండటంతో ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.