Teluguwonders:
విశాఖపట్నం:
తన సినీ కెరీర్ ‘అష్టాచమ్మా’తో వైజాగ్‌లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రీరిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ”ఎప్పుడో పదేళ్ల కిందట ఇక్కడ వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డా.అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సిటీతో ప్రేమలో ఉన్నా. సినిమా పాటల షూట్ కోసం అందరూ ఫారెన్ వెళ్తారు. కానీ, వైజాగ్‌ను మించిన అందమైన ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ‘అష్టాచమ్మా’కు మూడు రోజుల ముందు ఇక్కడే ప్రీమియర్ జరిగింది. నా కెరీర్ వైజాగ్‌లోనే ప్రారంభమైంది. 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. మళ్లీ ‘గ్యాంగ్‌లీడర్’ విడుదలకు మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. తర్వాతి 11 సంవత్సరాలు కూడా సేఫ్”.
ఇంత ఎనర్జీ మీరు చూపిస్తే ప్రతి సినిమాకు ఇక్కడే ఫంక్షన్ చేసుకోవాలంటే కష్టం కదా(నవ్వులు). సెప్టెంబరు 13 నుంచి థియేటర్‌లో ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కూడదు. మీదే బాధ్యత. విక్రమ్‌తో కలిసి పనిచేయాలని ‘మనం’ నుంచి అనుకుంటున్నాం. ఇన్నాళ్లకు ‘గ్యాంగ్‌లీడర్’తో అది కుదిరింది. తను ఎక్కడ ఉన్నా పాజిటివ్ ఎనర్జీ పంచి పెడతాడు. భవిష్యత్‌లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నా. మా పేరు మీద కూడా ‘గ్యాంగ్‌లీడర్’ రాసి పెట్టి ఉంది. రచయిత వెంకట్ అద్భుతమైన కథ అందించాడు. థియేటర్‌లో పడిపడీ నవ్వుతారు. అనంత్ శ్రీరామ్ చక్కని పాటలు రాశారు. ‘వై దిస్ కొలవెరి’ అంటూ అనిరుధ్ ప్రపంచాన్నే ఊపేశాడు. అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. కానీ, వరుస హిట్ సినిమాలు చేస్తామని అనుకోలేదు. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. తొలిసారి నటిగా కాకుండా ప్రియాంక ఎంతో పరణతితో చక్కగా నటించింది. లక్ష్మిగారు, శరణ్య నటన కూడా మిమ్మల్ని అలరిస్తుంది.
ఇక కార్తికేయ ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఇప్పటివరకూ ఎంతో వినమ్రంగా, వినయ విధేయతలతో నడుచుకున్నాడు. ఇలాగే కొనసాగితే, భవిష్యత్ చాలా ఎత్తుకు ఎదుగుతాడు. తెలుగులో మనకు మరో మంచి నటుడు దొరికాడు. సినిమాలో కార్తికేయ నటన చూసి ఆశ్చర్యమేసింది. తనకు ఫోన్ చేసి చెబుదామనుకున్నా. కానీ, నేరుగా తన నటనని మెచ్చుకోవాలి. ఈ నెల 13 తర్వాత నుంచి అతనిని కార్తికేయ అని కాకుండా ‘దేవ్’ అని పిలుస్తారు. మేమిద్దరం కలిసి త్వరలోనే మరోసారి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అందులో తను హీరోగా నటిస్తే, నేను విలన్‌గా నటిస్తా(నవ్వులు). నాపై ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణ పడి ఉంటా”అని అన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.