జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’ విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటుంది.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్ టు మై ఫాదర్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కింది.ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 🔴‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే మార్చాలి: సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో విపిన్ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
‘భారత్’ అనే పదాన్ని సినిమాకు టైటిల్‌గా వాడటం సరికాదని,కొన్ని డైలాగ్స్ ను కూడా డిలీట్ చేయాలని డిమాండ్ చేసారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ను వాడకూడదని వెంటనే దానిని మార్చాలని విపిన్ తన పిటిషన్‌లో కోరారు. కమర్షియల్ గా సొంత ప్రయోజనాలు,లాభాల కోసం ‘భారత్’ అనే పదాన్ని వాడటం చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. 🔴పాత్ర పేరును దేశంతో పోల్చడంపై అభ్యంతరం; సినిమాలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడంపై విపిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డైలాగ్‌ను చిత్రం నుంచి డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. 👉మరి దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.