సంపూర్ణేష్ బాబు కి పోటీగా రానున్న మరో హీరో …

saravana stores owner
Spread the love

Teluguwonders:

గతం లో సినిమాల్లో కి రావాలంటే చాలా అర్హతలు ఉండాలి..కానీ ఇప్పుడు డబ్బు ఒకటి ఉంటే చాలు..ప్రతీ ఒక్కరూ.. హీరోనే..

👉ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు. ఇలాంటి హీరోలు మన తెలుగులోనూ ఎంత మంది రాలేదు. ఇది కూడా ఆ బాపతే.

🔴శరవణ స్టోర్స్ యజమాని…: ఈ మధ్య కాలంలో టీవీలో శరవణ స్టోర్స్ యాడ్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది చూసే ఉంటారు. అందమైన మోడళ్ల మధ్య నుంచి హీరోలా నడుచుకుంటూ ఓ వ్యక్తి వస్తుంటాడు. ఆయనే శరవణన్. ది లెజెండ్ శరవణ స్టోర్స్ యజమాని. చెన్నైలో చాలా పాపులర్ అయిన ఈ స్టోర్ గురించి టీవీ యాడ్స్ ద్వారా తెలుగు ప్రజలకు కూడా తెలిసింది.

🔴మరో సంపూర్ణేష్ బాబు ..!!
అయితే, ఈ స్టోర్ కన్నా యాడ్‌లో నటించిన శరవణన్ బాగా పాపులర్ అయ్యారు. మరో సంపూర్ణేష్ బాబు ..అనుకోండి..!!తమన్నా, హన్సిక లాంటి టాప్ హీరోయిన్లతో ఈయన యాడ్స్ చేశారు.

🔴సినిమా పిచ్చి : శరవణన్ కి సినిమా అంటే ఎంత పిచ్చి అంటే శరవణ స్టోర్స్ యాడ్స్‌లో ఆయన తప్ప మరో మేల్ మోడల్ నటించడానికి వీళ్లేదు. ఆయనకి స్క్రీన్ మీద కనిపించడం అంటే అంత పిచ్చి. విమర్శలు వచ్చినా, విపరీతంగా ట్రోల్ చేసినా ఆయన పట్టించుకోలేదు. యాడ్స్ చేసుకుంటూ పోయారు.

🔴సినీ హీరోగా శరవణన్ :
ఇదిలా ఉంటే, ఇన్ని రోజులూ తన యాడ్స్‌తో హింసించిన శరవణన్ ఇకపై హీరోగా ప్రేక్షకుల మతులు చెడగొట్టనున్నారని జనాలు సరదాగా చెప్పుకుంటున్నారు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ యాడ్ స్పెషలిస్ట్ సినీ హీరోగా మారుతున్నారు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. శరవణన్ హీరోగా తమిళ సినిమా ఖరారైంది. దర్శక ద్వయం జేడీ, జెర్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తమిళ పరిశ్రమలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారని సమాచారం. శరవణ స్టోర్స్ యాడ్స్ చూస్తే ఈ శరవణన్ టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది. అలాగే, శరవణన్ సరసన నటించడానికి టాప్ హీరోయిన్లను కూడా సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం జేడీ, జెర్రీ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందట.

saravana

👉 ఈయన దగ్గర డబ్బులున్నాయి. హీరో కావాలనే కోరిక తీర్చుకుంటున్నారు. ఇక భరించడం ప్రేక్షకుల వంతు. బలయ్యేవాడు ప్రేక్షకుడే.. కదా..వాళ్లదేముంది…


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading