🔴శంకర్ : తమిళ ఇండస్ట్రీలో శంకర్ సినిమా రిలీజవుతుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్సైపోతారు. ఎందుకంటే “జెంటిల్ మేన్”, “భారతీయుడు”, “ఒకే ఒక్కడు” అటు తమిళ్ తో పాటు తెలుగులో భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా డైరెక్టర్ గా శంకర్ స్టామినానీ ప్రూవ్ చేశాయి. అయితే శంకర్ ఏ కథా వస్తువు తీసుకున్న చాలా అడ్వాన్స్ గా ఆలోచించి సినిమా తీస్తాడు. అంతేకాదు ఎంతో సామాజిక స్పృహతో సినిమాని తెరకెక్కిస్తాడు. అందుకే శంకర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్.
ఇక సూపర్ స్టార్ “రజనీ కాంత్” హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన “రోబో” అయితే శంకర్ కి స్టార్ డైరెక్టర్ గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమా సృష్ఠించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందించిన “రోబో”తో సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా శంకర్ సినిమా అంటే క్షణం ఆలోచించకుండా డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు.
🎉రజనీ కాంత్..గతం లోనే ఇచ్చిన సలహా:
“రోబో” ఫంక్షన్ లో సూపర స్టార్ రజనీ కాంత్.. మెగా స్టార్ చిరంజీవికి..”మీరు శంకర్ తో ఒక సినిమా చేయండి” అని సలహా ఇచ్చారు. అందుకు చిరు కూడా ఉత్సాహంగా.. తప్పకుండా అంటూ సమాధానమిచ్చారు. 👉కాని ఎందుకనో “శంకర్-మెగా స్టార్” కాంబినేషన్ లో సినిమాను చూసే ఛాన్స్ మెగా ఫ్యాన్స్ కి రానే లేదు. కానీ ఆ అవకాశం అభిమానులకు త్వరలోనే రానుంది .ఇప్పటికే తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో త్వరలో నటించబోతున్న మెగాస్టార్ శంకర్ సినిమా ని కూడా ప్లాన్ చేస్తారని టాక్ . 👉అదే మాట నిజమైతే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేద్దాం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.