Teluguwonders:
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తుండగా, తొలిసారి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే నిన్న యూట్యూబ్ లో రిలీజయిన ఈ సినిమా అధికారిక ట్రైలర్, ఇప్పటికే లక్షలాది వ్యూస్ తో దుమ్ము దులుపుతూ ముందుకు సాగుతోంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న ముంబై లో నిర్వహించిన యూనిట్ సభ్యులు, నేడు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన హీరోయిన్ శ్రద్ధ, తెలుగు సినిమాలపై అలానే ఇక్కడి ప్రజలపై తన మనసులోని భావాలని బయట పెట్టారు. తనకు హైదరాబాద్ అంటే ఒకరకంగా సెకండ్ హోమ్ అని, తనకు ఇక్కడ అనేక మంది స్నేహితులు కూడా ఉన్నారని, ఇక సాహో సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తరువాత, ఇక్కడి స్నేహితులు తనను రమ్మని పలుమార్లు ఆహ్వానించారని అన్నారు. ఇక కొన్నాళ్ల క్రితం సాహో షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన తనకు ఇక్కడి ప్రజలతో పాటు మరియు వాతావరణం ఎంతో బాగా నచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ సహా సాహో యూనిట్ సభ్యులు మొత్తం తనను ఒక కుటుంబ సభ్యురాలిగా చూసుకున్న విధానాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.
అలానే ఈ సినిమా ద్వారా తనకు ఎంతో ఇష్టమైన భాషల్లో ఒకటైన తెలుగు వారికి పరిచయం కావడం, తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడం ఎంతో హ్యాపీ గా ఉందని ఆమె అన్నారు. అయితే నిజానికి ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు హిందీ సినిమాలు, అలానే నార్త్ పరిస్థితుల గురించే మాట్లాడుతుంటారని, అటువంటిది శ్రద్ధ కపూర్ ఈ విధంగా మన తెలుగు వారి గురించి ఇంత గొప్పగా మాట్లాడడం చూసి షాకింగ్ గా అనిపించినప్పటికీ, ఎంతో సంతోషం వేసిందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. కాగా సాహో సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుదల కాబోతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.