Teluguwonders:
ఇప్పటికే రిలీస్ అయ్యిన “శ్రీదేవి బంగ్లా”.. చిత్రం ఫస్ట్ టీజర్ కావాల్సినంత వివాదాన్ని క్రియేట్ చేసింది .ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నార అనే రీతి లో ఈ సినీమా కు రెండో టీజర్ ను కూడా విడుదల చేసారు…
ప్రియా వారియర్ “శ్రీదేవి బంగ్లా”..చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది.
💕ప్రియాప్రకాశ్ వారియర్..: కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్. ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాప్రకాశ్. తొలి సినిమా ‘ఒరు అదారు లవ్’ సినిమా తో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాప్రకాశ్ ఇపుడు రెండో సినిమాతోరచ్చ చేయడానికి వచ్చేస్తోంది ,అది కూడా బాలీవుడ్‌లో .
🔵‘శ్రీదేవి బంగ్లా’: ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. రీసెంట్‌గా ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ విడుదల చేస్తే అది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.శ్రీదేవి బయోపిక్ కాదు అని చెపుతూనే, అదే పోలికలతో ఉన్న టీజర్లు మరోసారి దేశం మొత్తాన్ని తమ సినిమావైపు తిప్పుకునేలా చేసాయి..
🔴శ్రీదేవి బంగ్లా వివాదం:
ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఆమె పాత్ర పేరు శ్రీదేవి. ఈ పాత్ర నిజంగానే బాత్ డబ్‌లో పడి చనిపోయినట్టు ఈ ట్రైలర్‌లో ఉంటడంతో ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రైండ్ అవుతోంది.
🔴శ్రీదేవి జీవితం కు సంబందించినదా : ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమా శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిందా ? లేదా అనే విషయమై మీడియా ప్రశ్నించగా ప్రియా ప్రకాష్ వారియర్ ఈ విషయమై స్పందింలేదు.ఈ సినిమా ట్రైలర్ శ్రీదేవి నిజ జీవితాన్ని పోలీ ఉండటంతో ‘శ్రీదేవి బంగ్లా’ చిత్ర దర్శక, నిర్మాతలకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ లీగల్ నోటీసులు పంపారు.
🔴హైప్ కోసమే ఇదంతా :
ప్రియా ప్రకాష్ వారియర్ మొత్తానికి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికే దర్శక, నిర్మాతలు శ్రీదేవి పేరు వాడుకున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ ఎంట్రీకి ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
🔴న్యూడ్ లైఫ్ డైలాగ్ పై ప్రియా వారియర్ కు బెదిరింపులు : ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ లో “సారీ దునియా తేరి నంగి జిందగీ దేఖేగి” అనే డైలాగ్ మరో కాంట్రవర్సీ కి ఊతమిచ్చింది. దానర్ధం “ప్రపంచమంతా నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది” అని. అయితే ఈ డైలాగ్ పై ఇప్పటికే సోషల్ మీడియా వేదిక గా ప్రియా వారియర్ కు బెదిరింపులు కూడా మొదలయ్యాయని చెపుతున్నారు..
ఆ టీజర్ పై మీరూ ఓ లుక్ వేయండి….
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.