Teluguwonders:
టాలీవుడ్ కి రవితేజ హీరోగా నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ వంటి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే శ్రీను వైట్ల సినిమాలు, ఒకానొక సమయంలో వరుసగా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తరువాత నాగార్జున గారితో కింగ్, వెంకటేష్ గారితో నమో వెంకటేశ వంటి హిట్ మూవీస్ ని తీసిన శ్రీను వైట్లకు ఏకంగా,
సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో, శ్రీను గారు ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. వారిద్దరికలయికలో వచ్చిన దూకుడు సినిమా, అప్పట్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.
ఇక అదే ఊపులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో శ్రీను గారు తీసిన బాద్షా సినిమా కూడా మంచి సక్సెస్ ని సాధించింది. ఇక అనంతరం ఆయన మహేష్ తో కలిసి తీసిన ఆగడు సినిమా ఫ్లాప్ గా నిలవడంతో శ్రీను వైట్లకు కెరీర్ పరంగా చిన్న బ్రేక్ పడింది. ఇక అక్కడినుండి రామ్ చరణ్ తో బ్రూస్ లీ, వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్, ఇటీవల రవితేజతో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఘోర పరాజయాలు అందుకుని, శ్రీను వైట్ల గారికి కెరీర్ పరంగా చాలా పెద్ద నష్టాన్ని తీసుకువచ్చాయి.
అయినప్పటికీ ఆయన మొక్కవోని దీక్షతో అతి త్వరలో టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నటుడితో సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారట. ఆ సినిమా కథ, కథనాల విషయంలో ఒకటికి రెండు సార్లు అలోచించి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారట శ్రీను గారు. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాతో తప్పకుండా తనకు మంచి బ్రేక్ వస్తుందని శ్రీను గారు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాతో ఆయన కెరీర్ ఎంతవరకు ఊపందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే….!!
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.