సాహో ని ఇంకోసారి చూడండి అంటున్న సుజిత్

Sujit says about saaho
Spread the love

Teluguwonders:

✍‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఎమోషనల్ పోస్ట్ :

‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో ఎంతో మందిని ఆకర్షించిన దర్శకుడు సుజీత్. 22 ఏళ్ల వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరవాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమాను తెరకెక్కించారు. ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్‌ని ప్రభాస్ ఎలా నమ్మి ఇంత భారీ చిత్రం చేశారంటూ గతంలో విమర్శలు వచ్చాయి. కానీ, సుజీత్‌ను ప్రభాస్ తొలి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుజీత్‌కు నీల్ నితిన్ ముఖేశ్ అండగా నిలిచారు. ‘దేవుడు నీకంతా మంచే చేస్తాడు బ్రదర్’ అంటూ కామెంట్ పెట్టారు. ‘సాహో’ సినిమా పట్ల ఎంతో గర్వపడాలని అన్నారు.

మొత్తం మీద ఈ భారీ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, తొలి రోజే సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. సుజీత్ రాసుకున్న కథ, కథనం బాగాలేవంటూ విమర్శలు వచ్చాయి. కానీ, ఈ ప్రభావం కలెక్షన్ల మీద పడలేదు. ‘సాహో’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సాహో’ సినిమా దర్శకుడు సుజీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన సినిమా చూసిన అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో ఏదైనా తక్కువైంది అని అనుకుంటే ఇంకోసారి చూడాలని సలహా ఇచ్చారు.

🔴 వివరాల్లోకి వెళ్తే :

సినిమా విడుదల తరవాత సుజీత్ కనపడకపోవడంపై చర్చ మొదలైంది. సుజీత్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి వారికి సమాధానంగా సుజీత్ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను ఇన్‌గ్రామ్‌లో పెట్టారు.

💥ఎన్నో అవరోధాలు అధిగమించి వచ్చా :

‘‘నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా తొలి షార్ట్ ఫిల్మ్ తీశాను. డబ్బులేదు, టీం లేదు.. కానీ ఆర్కుట్, కుటుంబం నుంచి నాకు ఎంతో ప్రోత్సాహం అందింది. నా షార్ట్ ఫిల్మ్స్‌కు 90 శాతం ఎడిటింగ్, షూటింగ్, డైరెక్షన్ నేనే చేసుకున్నా. నా తప్పుల నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. నా ప్రయాణంలో విమర్శ నాకెప్పుడూ ఎక్స్‌ట్రా బూస్ట్ ఇచ్చింది. చాలా సుధీర్ఘంగా ప్రయాణించాను. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాను. కానీ, వెనకడుగు వేయలేదు.

ఈరోజు చాలా మంది ‘సాహో’ చూశారు.. కొంత మంది ఇంకా ఏదో కావాలని అంటున్నారు. కానీ, చాలా మంది ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఈ సినిమాను చూసిన అందరికీ కృతజ్ఞతలు. మీకు సినిమాలో ఏదైనా మిస్ అయ్యింది అని అనిపిస్తే దయచేసి ఇంకోసారి చూడండి. ముందుకంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను నమ్మకంగా చెబుతున్నాను’’ అని సుజీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading