Teluguwonders:
తెలుగు పరిశ్రమకి 85 ఏళ్ల చరిత్ర ఉంటే అందులో 55 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్.. టాలీవుడ్ పరిశ్రమ గురించి చెప్పాల్సి వస్తే అందులో సురేష్ ప్రొడక్షన్స్ కి ఒక పేజీ ఉంటుంది..
🎬దగ్గుబాటి రామానాయుడు – సురేష్ ప్రొడక్షన్స్ : సినిమా మీద విపరీతమైన ప్రేమతోదగ్గుబాటి రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉన్న తన ఆస్తులు అమ్ముకొని మరి సినిమా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు . భారతదేశంలోని ఏ నిర్మాతకి, నిర్మాణ సంస్థకి సాధ్యం కానీ రీతిలో అన్ని భాషలో సినిమాలు చేసిన ఏకైక నిర్మాత రామానాయుడు.
🎬సురేష్ ప్రొడక్షన్స-లోగో : ఆయన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కి షార్ట్ కట్ లో SP అని ఉంటుంది..
🔴లోగో పై ఉన్న పిల్లలు వీళ్లే : సురేష్ ప్రొడక్షన్స్..లోగో ‘SP ‘ అనే లెటర్స్ తో ఉంటుంది.. వాటి మీద ఇద్దరు పిల్లలు వుంటారు. అసలు ఆ లోగో పై వాళ్లిద్దరూ ఎవరో..ఆ ఫోటోలు ఎలా వచ్చాయో 55 ఏళ్ల క్రితం ఏమి జరిగిందోతాజాగా చెప్పకొచ్చారు.సురేష్ బాబు..
👉55 ఏళ్ల క్రితం : ఒక రోజు నేను తమ్ముడు స్కూల్ కి వెళ్ళటానికి రెడీ అయ్యి వెళ్తుంటే నాన్నగారు పిలిచారు..అక్కడ S , P అనే అక్షరాలు తయారు చేసి ఉన్నాయి. వాటిపై నేను, తమ్ముడు నిలబడ్డాం.. దానిని ఫోటోగా చేసి లోగో తయారు చేశారు..దానిలో ‘ఎస్’ మీద తమ్ముడు నిలబడ్డాడు.. ‘పి’ నేను నిలబడ్డా,, అనుకోకుండా తమ్ముడు వెంకటేష్ ‘ఎస్’ ప్రకారం స్టార్ హీరో అయ్యాడు.. ‘పి’ ప్రకారం నేను ప్రొడ్యూసర్ అయ్యాను అంటూ చెప్పారు ఆయన. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ ..
🔴ఈ రకంగా నిర్మాత అయ్యా : నాకు అసలు సినిమా నిర్మాత కావాలని లేదు..అవుతానని కూడా అనుకోలేదు.. రోజు నాన్నగారు సినిమాకి సంబంధిచిన కలెక్షన్స్ బుక్ రాస్తూ ఉండేవాడిని, ఆలా ఆలా సినిమా నిర్మాణంపైనా నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది.. దీనితో మెల్లమెల్లగా నిర్మాతగా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు సురేష్ బాబు.. ఆ తర్వాత అనుకోకుండా అప్పట్లోవెంకటేష్ కూడా హీరో అవ్వడం తెలిసిందే.
🔴 మళ్లీ పుంజుకుంటున్న సురేష్ సంస్థ: ఆ మధ్య సినిమా నిర్మాణ విషయంలో కొంచం స్లో అయినా సురేష్ సంస్థ, మళ్ళి ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ వెంకటేష్ తో, రానా తో సినిమాలు నిర్మిస్తుంది, అలాగే టాలీవుడ్ లో వస్తున్నా చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ సినిమా పంపిణి రంగంలో దూసుకొని వెళ్తుంది.. రామానాయుడు వున్నప్పుడు ఎలా అయితే నిర్మాణ సంస్థగా ఒక వెలుగు వెలిగిందో, మళ్ళి అలాంటి ఊపు ఇప్పుడు కనిపిస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్..లోగో పై ఉన్న పిల్లవాళ్ళు ఎవరో కాదు సురేష్ బాబు, అయన తమ్మడు వెంకటేష్.. అని సురేష్ బాబు చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోయారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.