జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హరికృష్ణ మరణం కారణంగా ఈ పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ పడినా కూడా కారణం సరైందే కావడంతో సర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బర్త్ డేను కేవలం కుటుంబ సభ్యులతోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెషల్ ఉండదని జూనియర్ ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్న ఈ సమయంలో రాజమౌళి సడన్ షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
👉ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ :
ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ ఇప్పుడు ఇండియన్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 20న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.
👉కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ :
కొమరం భీంగా ఎన్టీఆర్ ఉండే లుక్ ఆ రోజు విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. రాజమౌళి దీన్ని సర్ ప్రైజ్ ప్యాకేజ్ కింద ఉంచాలని ప్లాన్ చేస్తున్నాడు. కచ్చితంగా ఈ గిఫ్ట్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చుతుందని ఆయన భావిస్తున్నాడు. 350 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి చూడాలిక.. రాజమౌళి ఇవ్వబోయే గిఫ్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. so fans wait for tarak’s first look…
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.