Teluguwonders:
అవును,మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది.ఎలా అనుకుంటున్నారా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేట్ గా అయినా మొత్తానికి ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.
🔴మహానటి’, ‘రంగస్థలం’, అ సినిమా లు :
ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి.
నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది.
👉బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే నుంచి చిలసౌ కు, 👉ఉత్తమ మేకప్, విభాగంలో, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు దక్కాయి.
🔴ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. `మహానటి`, `రంగస్థలం` చిత్రాలకు జాతీయ అవార్డలు వస్తాయని ఆయన రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. మహానటి రిలీజ్ అనంతరం చిరంజీవి యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించి ఘనంగా సన్మానించిన సంగతి విదితమే. ఆయన చెప్పినట్టు ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆయన. 👉అలాగే ఇతర భాషల నుంచి అవార్డులకు ఎంపికైన వారందరికీ కూడా మెగాస్టార్ అభినందనలు తెలిపారు. 🌟తనయుడు రామ్ చరణ్ నటించిన `రంగస్థలం`కు జాతీయ అవార్డు రావడం మెగా స్టార్ కు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.