పవర్ స్టార్ కోసం మూడు సినిమాలు !!!

Three movies for Power Star
Spread the love

Teluguwonders:

తెలుగు చలన చిత్ర సీమలో పవర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఏకైక హీరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేవుడు సాధించలేడేమో గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధిస్తాడు అని అంటారు. పవర్ స్టార్ అంటే యూత్ లో ఒక క్రేజ్ ఉంది.. పవర్ స్టార్ అంటే యూత్ ఐకాన్ అని చాలా మంది అంటున్నారు. సినిమాల నుండి రాజకీయాల వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అయన పేరు మారుమోగుతుంది.

అయితే గత ఏడాది నుండి ఇప్పటివరకు వరకు అయన సినిమాలేవీ రాలేదు. జనసేన పార్టీని స్థాపించిన అయన గతంలో కొద్దిరోజులు రోజులుగా జనం మధ్యలో ఒక సాధారణ నాయకుడుగా తిరుగుతున్న విషయం తెలిసిందే. కాగా , పార్టీ కార్యకలాపాలు నత్తనడగా సాగుతుండటంతో అయన మనసు మళ్ళీ సినిమాల వైపు మళ్లింది.

తాజాగా అయనతో సినిమా చేయాలనీ ముగ్గురు డైరెక్టర్లు క్యూలో ఉన్నారట..

డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ కోసం ఒక కథని సిద్ధం చేశారట. ఈ కథ కచ్చితంగా పవన్ కి నచ్చుతుందనే గట్టిగానే నమ్మకం పెట్టుకున్నాడు క్రిష్. ఇకపోతే పింక్ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు దక్కిచుకున్నారు.ఆ సినిమాను పవన్ కళ్యాణ్ తో రూపొందించాలని అయన వెల్లడించారు. దానికి సంబందించిన బ్యాగ్ గ్రౌండ్ పనులు కూడా ఇప్పటికి పూర్తి కూడా చేశారట దిల్ రాజ్..

మూడో సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ వారు పవన్ సినిమాని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట. దానికోసం గతంలో పవన్ కు హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించాలని ప్రయత్నంలో ఉన్నారట. మొన్న ఆమధ్య అన్న చిరంజీవి సినిమా కోసం పవన్ బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. గంభీరమైన ఆ గొంతు అందరి గుండెల్లో నిలుస్తుందని అంటున్నారు. ఆ ముగ్గురిలో పవన్ ముందుగా ఎవరితో సినిమా చేస్తారా అనేది మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading