Teluguwonders:
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన అభిమానులకు మరో కానుక ను ఇచ్చారు మహేష్ బాబు.
💥విడుదలైన టైటిల్ సాంగ్ :
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిట్ సాంగ్ విడుదలైంది. 💥భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
🔴కేవలం 25 నిమిషాలు మాత్రమే అలా :
మహేష్ బాబు తొలిసారిగా ఈ చిత్రంలో ఆర్మీఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపులో చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు కనిపించేది సినిమా మొత్తం కాదని, కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమా మొదటి భాగంలో వస్తుందని, ఆ తర్వాత అసలు సినిమా కథలోకి ఎంటరవుతుందని టాక్.ఐతే ఈ సినిమాలో మహేష్ ఇండియన్ ఆర్మీని కించపరిచాడంటున్నారు.
💥వివాదానికి కారణమైన ” సరిలేరు నీకెవ్వరు” ది ఇంట్రో లుక్ :
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. శుక్రవారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ది ఇంట్రో పేరుతో మూవీలో అతడి లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. అందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ లుక్ అతడి అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ లుక్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. కాగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం రెండూ వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంది అంటే విడుదలయ్యే సమయానికి ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఇంకెన్ని గొడవలు వస్తాయో చూడాలి.
అసలు విషయం ఏంటంటే :
💥నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ లుక్ తో పోలిక:
వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘అల్లు అర్జున్ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అనే చిత్రంలో నటించగా.. అందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక ఆ పాత్ర కోసం బన్నీ చాలా మేకోవర్ అయ్యాడు. ముఖ్యంగా తన బాడీ షేప్ నుంచి హెయిర్ స్టైయిల్ వరకు ఆర్మీ అధికారుల్లాగానే మార్చుకున్నాడు బన్నీ. ఇక తాజాగా వచ్చిన మహేష్ లుక్‌లో అలాంటి మేకోవర్లు ఏవీ లేవని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు మహేష్, బన్నీ ఫొటోలను పక్కనపెడుతూ.. ఆర్మీ హెయిర్‌కట్, ప్రాపర్ షేవ్, బాడీ పిట్నెస్ తేడాలను చూపించాడు. దానికి ఇండియన్ ఆర్మీని మహేష్ కించపరిచాడంటూ అతడు కామెంట్ పెట్టాడు. దీనిని బన్నీ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.