Teluguwonders:
అదిరింది, సర్కార్ సినిమాల తో తెలుగులో మార్కెట్ బాగా పెంచుకున్నారు దళపతి విజయ్ . జూన్ 22న విజయ్ బర్త్ డే.
విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ అయిపోతున్నాడు.
🔴 బిగిల్ సినిమా ఫస్ట్ లుక్ : ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.. దీనికి బిగిల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
🔴విజయ్-అట్లీ : ఇప్పటికే ఈ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.ఇదివరకు ఈయన విజయ్ తో తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇప్పుడు మూడోసారి సంచలనానికి తెర తీస్తున్నారు ఈ కాంబినేషన్.
🔴ఫుట్ బాల్ కోచ్ పాత్రలో: తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒలంపిక్స్ నేపథ్యంలో చేస్తున్నాడు అట్లీ కుమార్. ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు.ఒలంపిక్స్ లోఅక్కడ జరిగే అన్యాయాలను చూపిస్తున్నాడు అట్లీ.ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు విజయ్.
🔴ఇందులో కూడా ద్విపాత్రాభినయం : బిగిల్ లో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో సాకర్ టీం కోసం 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది.
🔴తెలుగులో కూడా :
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్, యోగిబాబు, డేనియల్ బాలాజీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. విల్లు తర్వాత మరోసారి ఈ జోడీ కలిసి నటిస్తున్నారు. మొత్తానికి తెరీ, మెర్సల్ తర్వాత విజయ్, అట్లీ మరో సంచలనానికి తెరతీస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
గతంలో ‘చక్ దే ఇండియా’లో హాకీ కోచ్‌గా నటించాడు కింగ్ ఖాన్. ఇప్పుడు అలాంటి మహిళా టీం కోచ్ పాత్రలోనే విజయ్ కూడా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు విడుదలైన ఫస్ట్ లుక్.. బిగిల్ అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఇక టైటిల్ కూడా ప్రకటించక ముందే శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఓ ఛానెల్ ఏకంగా 50 కోట్లు చెల్లించిందని తెలుస్తుంది. తమిళనాట ఓ ప్రముఖ ఛానెల్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో నిర్మితమౌతుంది .
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.