Teluguwonders:
మంచు విష్ణు మళ్లీ తన సత్తాను నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఓటర్. సామాజిక అంశంతో రూపొందిన పొలిటికల్ సెటైర్ మూవీని దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి రూపొందించగా, సుధీర్ పూదోట నిర్మించాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ సార్ధక్ బ్యానర్‌పై జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన రాజకీయపరమైన చిత్రాల్లో ఓటర్ మంచి పాయింట్‌తో రూపొందింది.
ఓటర్ చిత్రం రిలీజ్‌కు ముందు పలు వివాదాల కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.టాలీవుడ్‌లో మంచు విష్ణు హీరోగా రేసులో కాస్త వెనుకపడినట్టు కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా మంచు విష్ణును మళ్లీ ట్రాక్‌లో పడేసిందా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాలో కొత్తగా ఒక పాయింట్ ను ‘టచ్’ చేశాడు. ఆ పాయింట్ ఏమిటో .. దానిని తెరపై ఆవిష్కరించడంలో ఆయన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం.
✍స్టోరీ :
గౌతమ్ (మంచు విష్ణు) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. హైదరాబాదులో వున్న గౌతమ్ తల్లిదండ్రులు (నాజర్ – ప్రగతి) ఆయనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓటు వేయడానికి అమెరికా నుంచి హైదరాబాదు వచ్చిన గౌతమ్, ట్రాఫిక్ లో భావన (సురభి)ని చూసి మనసు పారేసుకుంటాడు.
తర్వాత తనకి తెలియకుండానే భావన ఇంటికి పెళ్లిచూపులకి వెళతాడు. భావన నచ్చేసిందని చెప్పేస్తాడు. తాను ఓకే అనాలంటే ఎదుటివారికి టాస్కులిచ్చే అలవాటున్న భావన, రాజకీయనాయకుడైన గొట్టం గోవిందం (పోసాని) చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చేలా చేయగలిగితే గౌతమ్ ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దాంతో ఆ టాస్కును పూర్తిచేయడం కోసం గౌతమ్ తనదైన స్టైల్లో గొట్టం గోవిందం వెంటపడుతుంటాడు.
ఈ క్రమంలోనే పేదల కోసం కేటాయించబడిన వందల కోట్ల విలువ చేసే ఒక స్థలాన్ని, గొట్టం గోవిందం చేత మంత్రి భానుశంకర్ (సంపత్ రాజు) కబ్జా నుంచి బయటికి తీసుకురావడానికి గౌతమ్ ప్రయత్నిస్తాడు. ఈ కారణంగా భానుశంకర్ కి శత్రువుగా మారిన గౌతమ్ ఆయన వలన ఎదుర్కునే అనూహ్యమైన పరిస్థితులతో కథ ముందుకు వెళుతుంది.
👉ఫస్టాఫ్ :
ఎన్నారై హీరో మంచు విష్ణును కమర్షియల్ ఫార్మాట్‌లో పరిచయం చేయడం ద్వారా సినిమా సాదాసీదాగా మొదలవుతుంది. సురభితో ప్రేమలో పడిన తర్వాత సినిమా అసలు కథలోకి వెళ్తుంది. పొలిటికల్ టచ్, గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా సాగుతుంది. ఎమ్మెల్యేగా పోసాని వ్యవహారం కామెడీ టచ్‌తో సాగుతుంది. ఇక మంత్రిని ఎదురించడం ద్వారా స్టోరి సీరియస్ నోట్‌లోకి వెళ్తుంది. హీరో, విలన్ మధ్య సవాల్ ప్రతీ సవాల్‌తో తొలిభాగం ముగుస్తుంది. తొలి భాగంలో హీరో క్యారెక్టర్, ఇతర పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకొన్నట్టు కనిపిస్తుంది. సురభి పెద్దగా గ్లామర్‌ను పండించలేదనే ఫీలింగ్ కలుగుతుంది.
👉సెకండాఫ్ :
ఓటర్ సినిమాకు సెకండాఫ్‌నే ప్రాణంగా నిలుస్తుంది. ప్రజాసేవ చేయని ఎమ్మెల్యే, ఎంపీలను వెనుకకు రప్పించే (రీకాల్) అంశాన్ని ఎత్తుకోవడం సినిమాకు ఆకర్షణగా మారుతుంది. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ప్రజలను చైతన్య పరిచే అంశం బాగా ఉంది. కాకపోతే రెగ్యులర్ ప్యాటర్న్‌లో దానిని చేయడం తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కామన్ మ్యాన్, ఓటర్ మూడో కన్ను తెరిస్తే ఏమౌతుందో అనే అంశం సినిమాకు హైలెట్. రీకాల్ అంశాన్ని దర్శకుడు సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు కానీ బలమైన సన్నివేశాలు రాసుకొంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశానికి ఛాన్స్ ఉండేది.
🔴నటి నటుల ఫెర్ఫార్మెన్స్ :
మంచు విష్ణు నటనపరంగా గతంలో కంటే ప్రస్తుతం మెచ్యురిటీతో కనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో కొత్తగా చెప్పనక్కర్లేదు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లలో ఆయన బాగా ఆకట్టుకొన్నాడు. గౌతమ్ పాత్రలో ఒదిగిపోయాడు. తన పాత్ర పరిధి మేరకు మరోసారి సత్తా చాటుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఇక సురభి గ్లామర్ పాత్రకే పరిమితమైంది. కథలో సీరియస్ అంశాలు తెరపైకి రావడంతో గ్లామర్ పండించడానికి స్కోప్ లేకపోయింది.
🔴మిగితా క్యారెక్టర్లలో :
చెప్పుకోవాల్సింది పోసాని, సంపత్ రాజ్ క్యారెక్టర్లు. ఈ రెండు క్యారెక్టర్లు రొటీన్‌గానే కనిపిస్తాయి. కామెడీ టచ్ ఉన్న ఎమ్మెల్యేగా పోసాని తన పాత్రలో ఒదిగిపోయాడు. తన మార్కు హాస్యాన్ని బాగా పండించాడు. ఇక ప్రధానమైన విలన్ పాత్రలో సంపత్ రాజ్ కనిపించాడు. మంచు విష్ణుతో పోటాపోటీ సీన్లలో ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడని చెప్పవచ్చు. సుప్రిత్, టెంపర్ వంశీ తమ పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.
🔴సాంకేతిక హంగులు :
ఓటర్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు కానీ.. రీరికార్డింగ్ బాగుంది. అశ్విన్ అందించిన సినిమాటోగ్రఫి చాలా రిచ్‌గా ఉంది. విదేశాల్లో చిత్రీకరించిన పాటలు కనువిందు చేస్తాయి. ప్రవీణ్ కేల్ ఎడిటింగ్ ఫర్వాలేదు. చకచకా సీన్లు పరుగులు పెడుతాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల నిడివి పెరిగినట్టు అనిపిస్తుంది. వాటి గురించి కాస్త జాగ్రత్త తీసుకొంటే సినిమా వేగం పెరిగేందుకు అవకాశం ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
👉ఫైనల్‌గా :
కథ, కథనాలపై మరికాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి చిత్రంగా నిలిచిపోయేది. బీ,సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించే ఛాన్స్ కూడా ఉంది.
బలాలు,బలహీనతలు :
👉ప్లస్ పాయింట్స్ :
మంచు విష్ణు
కథ
సినిమాటోగ్రఫి
డైలాగ్స్
👉మైనస్ పాయింట్స్ :
కామెడీకి దూరంగా నడిచిన కథ ,
ఆసక్తిని పెంచలేకపోయిన కథనం ,
బలహీనమైన సన్నివేశాలు..
సురభి..
మ్యూజిక్,
సెకండాఫ్ నిడివి..
👉తెర వెనుక, ముందు :
మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, శ్రవణ్, టెంపర్ వంశీ, నాజర్, ప్రగతి తదితరులు
👉కథ, దర్శకత్వం: జీ కార్తీక్ రెడ్డి
నిర్మాత: సుధీర్ కుమార్ పూదోట
మ్యూజిక్: ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: అశ్విన్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
రిలీజ్: 2019-06-21
ఈ మధ్య కాలంలో రాజకీయాల నేపథ్యంలోని కథలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. ఓటుకు వున్న విలువ ఎలాంటిదో ఓటర్లకు చెప్పి చైతన్యవంతులను చేయడానికి కథానాయకుడు రంగంలోకి దిగడం .. స్వార్థరాజకీయ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం వంటి ప్రధాన లక్ష్యంతో ఆ కథలు కంచికి వెళ్లాయి. అదే తరహా కథ అయినప్పటికీ
కథలో అసలుకన్నా హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. కథా వస్తువును వినోదానికి దూరంగా తీసుకెళ్లడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఊహకందని సన్నివేశాలుగానీ .. ఆసక్తికరమైన మలుపులుగాని లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్.
👉Rating : 2.75/5
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.