Teluguwonders:
టాలీవుడ్ దర్శకులలో కామెడీని, యాక్షన్ కలగలిపి సినిమాలు తీసే వాళ్ళలో ముందుండేవాడు వివి వినాయక్. సుమోలు పైకి లేవడం అనేది వివి వినాయక్ సినిమాల్లోనే చూస్తాం. తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన వినాయక్ ప్రస్తుతం విజయాలు లేక సినిమాలు తగ్గించేసాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా మంచి హిట్ లభించినా దాని క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్ళింది.
ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో “ఇంటిలిజెంట్” సినిమా తీసినా అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతో మళ్ళీ తన తర్వాతి సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే గత కొంత కాలంగా వివి వినాయక్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలు నిజమేనని వివి వినాయక్ కూడా స్పష్టం చేసాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించబోయే సినిమాలో వీవీ వినాయక్ హీరోగా పరిచయం కాబోతున్నారు.
ఈ విషయాన్ని దిల్ రాజు కూడా ప్రకటించారు. ఈ సినిమాకి ఎన్ నరసింహరావు దర్శకత్వం వహించనున్నారు. ఈయన గతంలో “శరభ” అనే సినిమాకి దర్శకత్వం వహించారు.ఇందులో వినాయక్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే దీని కోసం ఆయన కొద్దిరోజులుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.
నేపథ్యంలో వినాయక్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. హీరో గా కనబడాలంటే ఫిట్ గా ఉండాలి. అందుకే జిమ్ చేస్తున్నా… అంతేకానీ పెద్ద హీరో అయిపోవాలని కాదు’ అని చెప్పుకొచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నందుకు వినాయక్ రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మొదటి సినిమాతోనే స్టార్ హీరోల కేటగిరీలోకి చేరిపోయినట్టే.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.