Teluguwonders:
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క‘కన్నుగీటి’ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ వింకీ బ్యూటీ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఐతే ఈ భామకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
💥విజయదేవర కొండ :
‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో విజయ్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది. ఇటీవల వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కావడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే తెలియని దక్షిణాది సినీ ప్రేక్షకుడు లేడు.విజయ్ దేవరకొండ.. పేరుకి తెలుగు సినిమా హీరోనే అయినా ఆయనకు దక్షిణాది అంతటా అభిమానులు ఉన్నారు.విజయ్ దేవరకొండకు కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే అభిమానులు లేరు..!
🔴సినీ పరిశ్రమల్లో కూడా :
డియర్ కామ్రేడ్’ చిత్ర ప్రచారంలో భాగంగా కొచ్చి వెళ్లిన విజయ్‌ను ప్రియా కలిసింది. అప్పుడు దిగిన ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని తెలుగును ఇంగ్లిష్‌లో రాసింది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 5.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
🔴 నితిన్ సినిమాలో ప్రియా ప్రకాశ్ :
ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’, ‘లవ్ హ్యాకర్స్’ సినిమాల్లో నటిస్తోన్న ప్రియా.. తెలుగులో నితిన్ సరసన చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.