చంద్రబాబు నాయుడు భవనాన్ని కూల్చివేయనున్న జగన్..!!!?

Spread the love

Teluguwonders:

ప్రజావేదికపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

🔴ప్రజావేదిక : మాజీ CMచంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన ఇంటిపక్కనే ఉన్న ప్రజా వేదిక ను ఎంతో మక్కువతో నిర్మించుకున్నారు . అయితే ఇది అక్రమ కట్టడం అని అంటున్నారు.

🔴ప్రజావేదిక కట్టడాన్ని కూల్చేయాలి : సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేయాలంటూ స్పష్టంగా చెప్పారు.
అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు మరో అక్రమ కట్టడమైన ప్రజావేదికను తన వాడకానికే కేటాయించాలంటూ లేఖ రాయటంతో వివాదం మరింత పెరిగిపోయింది. చంద్రబాబు లేఖకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

అందుకు అనుగుణంగానే అందులోని తెలుగుదేశంపార్టీ మెటీరియల్ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. దాంతో ఈ విషయాన్ని టిడిపి నేతలు బాగా రాద్దాంతం చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. అక్రమ కట్టడమంటూనే ఇందులో జగన్ కలెక్టర్ల సమావేశం ఎలా పెడతారంటూ పెద్ద లాజిక్ కూడా లేవదీశారు.

అలాంటి ప్రశ్నలకు సమాధానంగానే జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ కట్టడాల్ని ఎలా ప్రోత్సహించారో అందరికీ ఉదాహరణగా చూపించేందుకే ప్రజావేదికలో సమావేశాన్ని పెట్టినట్లు చెప్పారు. మంగళవారం సమావేశం తర్వాత ప్రజావేదికను కూలగొట్టేయాలంటూ జగన్ సమావేశం నుండే అధికారులకు ఆదేశాలివ్వటం సంచలనంగా మారింది. మొత్తానికి ప్రజావేదికపై చంద్రబాబుకు జగన్ పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి.

👉అయితే దీనిపై పోటీ పడిన టీడీపీ,వై. సీ. పీ : గతం లో..TDP-YCP ప్రజా వేదిక కోసం కుస్తీ పడ్డాయి.

🔴 చంద్రబాబు లేఖ : ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజా వేదికను తనకు కేటాయించాలని CM జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు.

🔴వైసీపీ లేఖ : ఇటు పార్టీ – ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజా వేదిక అనువుగా ఉంటుందని.. అది తమకే కేటాయించాలని సీఎస్‌కు YCP లేఖ రాయడంతో అప్పట్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

🔴ప్రజావేదిక పై విజయసాయిరెడ్డి ట్వీట్ :

ప్రజావేదిక ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయమని, చంద్రబాబు ఇంతకాలం దాన్ని పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారం కోల్పోయినా కూడా ప్రజావేదికను తన ఆధీనంలోనే ఉంచుకోవాలనుకోవడం సరికాదన్నారు. కలెక్టర్ల సమావేశం కోసమే భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని, టీడీపీ నేతలు సానుభూతి కోసమే డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.

👉ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉండవల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్లకు సూచనలు చేశారు.
ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా స‌రే అవినీతి పట్ల క‌ఠినంగా వ్వ‌వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. కాగా సోమవారం ఉదయం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రజా వేదిక నిర్మాణంపై అధికారులను జగన్ నిలదీశారు.

👉అధికారులే తప్పులు చేస్తే.. ఎదుటోళ్లను ఎలా ప్రశ్నించగలం అని అడిగారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. . గ్రామ స్థాయి నుంచి సీఎంవో వరకు ఎక్కడా ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదని.. ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకతతో అమలు కావాలని ఆదేశించారు..

మనం కూర్చున్న ప్రజా వేదిక భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే అన్నారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు.ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. మంగళవారం నుంచి ప్రజావేదికను కూల్చేస్తామని జగన్ చెప్పారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. మనం పాలకులం కాదు సేవకులమన్న విషయం గుర్తు ఉంచుకోవాలనుకున్నారు.

🔴టీడీపీలో అలజడి : అయితే కలెక్టర్ల సదస్సులోఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. కలెక్టర్ల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన వెంటనే టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చించారు.టెలీకాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతోనూ విషయంపై చర్చించినట్టు సమాచారం.

🔴ఉద్రిక్త పరిస్థితులు : తాజా పరిస్థితులు చూస్తుంటే టీడీపీ నేతలు కూల్చివేతను అడ్డుకుంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో ప్రజా వేదిక వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆందోళనలకు దిగితే వెంటనే అరెస్టులు చేసేలా చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *