సీఎం గారూ దీనిపై మీరే స్పందించాలి అంటున్న బీజేపీ నేత

Kanna Lakshminarayana wrote a letter to cm jagan
Spread the love

Teluguwonders:

వైసీపీ నేతల అక్రమాలు అడ్డుకోండి:

సీఎం జగన్‌కు కన్నా లేఖ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై ఇటీవల బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజన్న పేదోళ్ల ఆకలి నింపితే.. జగనన్న వారి కడుపులు కొడుతున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంచితే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ జగన్ కి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

🔴వైసీపీ నేతల పై జగన్ కు ఫిర్యాదు :

వైసీపీ నేతల అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. కారుమంచి గ్రామంలో భూకబ్జాకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి హోదాలో స్పందించి చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు.

✍ఆ లేఖ లోని సారాంశం ఇది..:

‘ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గ్రామస్థుల నుంచి రూ.25లక్షలు వసూలు చేశారు. ఆ డబ్బుతో గ్రామంలోనే 24ఎకరాలు కొనుగోలు చేసి వాటర్ ట్యాంక్ నిర్మించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేశారు.

🔴ప్రైవేట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు :

ఆ స్థలంలో కొంత భాగాన్ని వైసీపీ నేతలు సిరివరపు విజయభాస్కర్‌రెడ్డి, సూరం రమణ కబ్జా చేసి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. మూడు వారాల క్రితం నిర్మాణ పనులు చేపడుతూ గ్రామస్థులను బెదిరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి అయిన మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేఖతో పాటు అక్రమ నిర్మాణాల ఫోటోలను కూడా జతపరుస్తున్నాం. అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకుని కారుమంచి గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

💥ఎలా స్పందించినా సంచలనమే:

దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో..వేచి చూస్తున్నారు..రాజకీయ నాయకులు..విశ్లేషకులు..మొత్తానికి..ఆయన స్పందన ఎలా ఉన్నా అది ఒక సంచలనమే అవ్వబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *