Teluguwonders:
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి తరలించే సమయంలో అసెంబ్లీ ఫర్నిచర్ ను కోడెల తన ఇంట్లో దాచుకున్నట్లు అంగీకరించారు. గుంటూరు కేంద్రంగా కోడెల కుమార్ శివరాం నడుపుతున్న గౌతం బైక్ షో రూమ్ లోను అసెంబ్లీ ఫర్నిచర్ ఉన్నట్లు తేలడం తో కోడెల ఈ కేసులో దాదాపుగా అడ్డంగా బుక్కయ్యారనే చెప్పాలి.
టీడీపీ ప్రభుత్వ హయాం లో కోడెల కుటుంబం కే టాక్స్ వసూలు చేశారని పలువురు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఆయన కుమారుడు, కూతురుపై పలు కేసులు నమోదయ్యాయి . కోడెల కూతురు కోర్టును ఆశ్రయించి తనని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు . ఇక కుమారుడి పై పలు కేసులు నమోదయ్యాయి . కోడెల కుటుంబ వ్యవహారశైలి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆయనపై ఆశలు వదులుకున్నట్లు పరోక్షంగా ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది . నిన్న, మొన్నటి వరకు కోడెల వ్యవహారశైలి పై ఇప్పటి వరకూ విపక్షాలు దుమ్మెత్తి పోయగా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయన కుటుంబ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏకంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా కోడెల తప్పు చేసి ఉంటే శిక్షించండని , కానీ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతామంటే సహించేది లేదని హెచ్చరిక చేశారు .దీనితో కోడెల అక్రమాలకు పాల్పడితే శిక్షించవచ్చునని టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లయింది రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఇప్పటివరకు కోడెల వెన్నంటి తెలుగుదేశం పార్టీ ఉంటుందని భావించిన వారందరికీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఏకాకిగా మారారని స్పష్టం అవుతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.