Teluguwonders:
BJP నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో చేరగా.. డాక్టర్లు చికిత్స అందించారు. ప్రధాని మోదీ ఆ వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు.
🔴వివరాలలోకి వెళ్తే :
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కార్డియాలజీ విభాగంలో ఆయన చేరగా.. డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఛాతి, శ్వాస సంబంధ సమస్యలతో ఆయన హాస్పిటల్లో చేరినట్టు వార్తలొస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్దన్ కూడా హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రధాని మోదీ కూడా హాస్పిటల్‌కు చేరుకున్నారు.
🔴అందుకే లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు:
2019 లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
👉66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
👉వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు.
🔴అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ :
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించింది.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో చేరారు. ఛాతిలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు వీల్‌చైర్లో ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీకి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి ఎయిమ్స్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. పార్టీ పెద్దలంతా ఎయిమ్స్‌కు చేరుకోవడంతో జైట్లీ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన తలెత్తింది.
దీంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘‘శుక్రవారం ఉదయం జైట్లీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండె నుంచి రక్తనాళాల ద్వారా శరీరం అంతటికీ రక్తం నిలకడగా ప్రసరిస్తోందని, శరీరంలోని కణాలన్నింటికి ఆక్సిజన్ సరఫరా జరుగుతోంద’’ని ఎయిమ్స్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తి తెలిపారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.