Teluguwonders:
హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున రెండో సారి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు అసెంబ్లీ లో కూడా డైలాగ్స్ వేస్తున్నారు. 👉ఆయన తాజాగా అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన కామెంట్ కి తనదైన డైలాగ్ తో..రి కౌంటర్ ఇచ్చారు . 👉సింహ, లెజెండ్‌తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య విలన్లను ఉద్దేశించి చెప్పే కౌంటర్ డైలాగ్స్ పలు సందర్భాల్లో మాంచి పాపులర్ అయ్యాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ చెబుతుంటే విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నిజ జీవితంలోకూడా బాలయ్య తనదైన డైలాగ్స్ తో, తనదైన శైలిలో అభిమానులను మెప్పిస్తున్నారు.
🔴బంట్రోతు వ్యాక్యలు :
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యుడిగా హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా గురువారం బంట్రోతు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేశాయి… పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు దారి తీసిన బంట్రోతు వ్యాఖ్యలపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం
🔴చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘కామెంట్స్ పై :
ఈ సందర్భంగా ఆయన నుంచి మీడియా వారు ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘అచ్చెన్నాయుడు చంద్రబాబుకు బంట్రోతు’ అని కామెంట్ చేయడంపై స్పందించాలని మీడియా వారుకోరగా…..అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని..మేమంతా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా సేవకులం అని… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా ప్రజల కోసమ పని చేసే బంట్రోతులమని అంటూ..నే..
🔴వైసీపీ కి కౌంటర్ :
మేము అలా బంట్రోతులమే కానీ వాళ్లు అనుకున్నట్లు కాదు. వారు ఎవరికి బంట్రోతులో వారికే తెలుసు’ అంటూ వైసీపీ ని ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యానించారు.
🔵గవర్నర్ ప్రసంగం పై పెదవి విరిచిన బాలయ్య :
ఇక గవర్నర్ ప్రసంగం ఆశించినంతగా లేదని బాలయ్య పెదవి విరిచారు. గవర్నర్ చేతి వృత్తుల వారికి ఏం చేస్తారో చెప్పలేదన్నారు. జలయజ్ఞం తరహాలో నీటి ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని.. మరోవైపు అమరావతి ప్రస్తావన లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.. కాగా
🎞మొదలైన బాలయ్య కొత్త చిత్రం :
‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత బాలయ్య చేయబోయే 105వ చిత్రం గురువారం ప్రారంభం అయింది. సి కళ్యాణ్ నిర్మాతగా హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.