Teluguwonders:
💥పవన్‌కు ‘పెద్ద ఎనర్జీ’ వస్తుంది.. ఆయన్ను ఇక ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక బీజేపీ నేత
👉వివరాల్లోకి వెళ్తే :
బీజేపీ, జనసేన దగ్గరవుతున్నాయనే అంశం.. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం మొదలైంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్‌తో భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. తాజాగా Janasena అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బీజేపీ నేత అన్నం సతీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. నాది ప్రస్తుతం స్టేట్ పార్టీ కాదు.. సెంట్రల్ పార్టీ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎనర్జీ వస్తుందని, ఇక ఆయన్ను ఎవరూ ఆపలేరన్నారు. ఆయన సీఎం అయితే చూడాలని ఉందన్నారు.
ఇటీవల అమరావతి ప్రాంత రైతుల సమస్య గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. దీంతో జనసేన పార్టీ బీజేపీ వైపు చూస్తోందనే భావన జనాల్లో బలపడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని అన్నం సతీష్ తెలిపారు.
💥దుమారం రేపుతున్న బీజేపీ నేత అన్నం సతీష్ వ్యాఖ్యలు :
పవన్‌కి పెద్ద ఎనర్జీ వస్తుంది. ఇక ఎవరూ ఆపలేరంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఢిల్లీ వస్తారు. . డిసెంబర్లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని జోస్యం చెప్పిన ఆయన.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు అంటూ గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ సభలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 👉ఢిల్లీ నేతలు రాష్ట్రానికి వస్తారంటూ.. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతాయని సతీష్ హింట్ ఇచ్చారు. ప్రత్యామ్నాయం వచ్చిన రోజున ఎవరు బ్యాక్ బోన్ అనేది తెలుస్తుందని సతీష్ వ్యాఖ్యానించారు.
🔴జనసేన అభిప్రాయం !? :
బీజేపీతో పొత్తు ఓకేగానీ.. విలీనం మాత్రం కుదరదనేది జనసేన నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని విలీనం చేయనని.. నలుగురు వచ్చి నా పాడె మోసే వరకూ జనసేనను నడుపుతానని పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. 👉చూద్దాం ఏం జరుగుతుందో..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.