Teluguwonders:
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ AIIMS Doctors ధ్రువీకరించారు.
అరుణ్ జైట్లీకి సీరియస్‌గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈనెల 9న ఎయిమ్స్‌కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. మళ్లీ పది రోజుల్లోనే మరో కీలక నేత చనిపోవడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల ప్రెస్ నోట్:
1952 డిసెంబర్ 28న అరుణ్ జైట్లీ జన్మించారు. ఢిల్లీలోని సెంట్ జేవియర్స్ స్కూల్లో ప్రాధమిక విద్యాభ్యాసం కొనసాగింది. 1973లో బీకాం చదివారు. Chartered Accountant కావాలనుకున్నా.. అది కుదరలేదు. దీంతో న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలని భావించారు. 1977లో లా పట్టా అందుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. జమ్మూకాశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిధారీ లాల్ దోగ్రా కుమార్తె సంగీతను అరుణ్ జైట్లీ 1982లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. రోహన్, సోనాలి వారి పిల్లలు.
1991 నుంచి ఆయన బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా ఆయన సభ్యుడే. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇండిపెండెంట్ హోదాతో సమాచార మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రామ్ జెఠ్మలానీ రాజీనామాతో 2000 సంవత్సరంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాత్రి నుంచి జైట్లీ ఆరోగ్యం మరింత విషమం:
అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం… ఎయిమ్స్‌కి వెళ్లిన రాష్ట్రపతి, అమిత్ షా తదితరులు.
2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజ్యసభలో విపక్ష నేతగా అరుణ్ జైట్లీనే కొనసాగారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ పగ్గాలుచేపట్టారు. దేశంలో అత్యంత భారీ ఆర్థిక సంస్కరణలు అయిన నోట్ల రద్దు, జీఎస్టీ కూడా అరుణ్ జైట్లీ హయాంలోనే అమలు కావడం విశేషం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.