Teluguwonders:
జగన్ పాలనపై వంద రోజులకే వ్యతిరేకత మొదలయ్యింది.. అందుకే ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అంటున్నారు. టీటీడీ పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారు అంటున్నారు బీజేపీ నేత.
👉వివరాల లోకి వెళ్తే :
వైఎస్సార్‌సీపీ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిపై విమర్శలు మొదలయ్యాయి. సంప్రదాయాలకు విరుద్దంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన ముందుగా టీటీడీ, తిరుమల చరిత్ర తెలుసుకుంటే మంచిదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.సీఎం జగన్ తిరుమల చరిత్ర తెలుసుకుంటే మంచిది పాలమకండలిలో 36మందిని ఎందుకు తీసుకున్నారు. తనను ఎవరూ అడగరని సీఎం జగన్ అనుకుంటున్నారా అని ఆయన అన్నారు .
🔴టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం పై :
ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో టీటీడీ ధార్మిక సంస్థా.. ధర్మసత్రమా అనే అనుమానాలు మొదలయ్యాయన్నారు . పాలకమండలిలో 36మందిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు భానుప్రకాష్ రెడ్డి. తనను ఎవరూ అడగరనే అహంకార ధోరణితో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని.. టీటీడీ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వస్తే వాహన మండపంలో సరిపోరని సెటైర్లు పేల్చారు. పాలకమండలిని రాజకీయ కోణంలో చూడట్లేదన్నారు.
టీటీడీ పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. . అధికారంలోకి వచ్చిన వంద రోజులకే జగన్ ప్రభుత్వం విమర్శల ఎదుర్కొంటోందని.. ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అనుకుంటున్నారన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.