Teluguwonders:
వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై, మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఐతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు బడి మానేస్తున్నారంటే తప్పు గత పాలకులది కాదా? అని ప్రశ్నించారు
🔴పవన్ వ్యాఖ్యలు తన అవివేకానికి నిదర్శనం-బొత్స సత్యనారాయణ స్పందన:
రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు, అవినీతిపరులకు జనసేనాని వత్తాసు పలుకుతున్నారని మంత్రి ఆరోపించారు. పవన్ అవినీతిపరులతో టచ్‌లతో ఉంటూ తమపై విమర్శలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని బొత్స ఎద్దేవా చేశారు. జనసేనాని వ్యాఖ్యలు ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శమన్నారు. ఏ అంశంపైనా పవన్ కళ్యాణ్ సరిగా స్పందించలేకపోయారన్నారు.
పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల ఆడపిల్లలు స్కూలుకు వెళ్లలేకపోవడానికి తప్పు ఎవరిది..? గత పాలకులదా? జగన్‌దా? దీన్ని బట్టే పవన్ ఆలోచనాస్థాయి ఏంటో తెలుస్తోందని బొత్స ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ జరిగే వరకూ పవన్ కళ్యాణ్ ఆగాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 300 కోట్లు నష్టం వచ్చిందని పవన్‌కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అమరావతిపై గత ప్రభుత్వం గెజిట్ విడుదల చేయలేదు సరే.. వంద రోజుల పాలనలో మీరెందుకు గెజిట్ విడుదల చేయలేదని పవన్ ప్రశ్నించడాన్ని బొత్స తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమన్నారు.రాజమౌళి అద్భుత దర్శకుడే.. కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలో ఆయనకేం తెలుసని బొత్స ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న బొత్స.. అవన్నీ బయటకు తీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.