Teluguwonders:
Congress పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ సమావేశం కాబోతోంది. రాహుల్ స్థానంలో కొత్త నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ముకుల్ వాస్నిక్‌ను పార్టీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
👉కాంగ్రెస్ పార్టీకి అధినేత కరువు :
భారతదేశంలోనే అతి ప్రాచీన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి రథసారథి రాబోతున్నాడు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. గాంధీ కుటుంబానికి విధేయుడు, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు, రాజకీయ కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌కే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
🔴 ముకుల్ వాస్నిక్ :
మహారాష్ట్రకు చెందిన నేత ముకుల్ వాస్నిక్ . 2009 ఎన్నికల్లో ఆయన రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1984లో 25 ఏళ్ల వయసులోనే తొలిసారి బుల్దానా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికల్లో ఓ దఫా గెలిస్తే.. మరోసారి ఓడేవారు. 1998-90 మధ్య ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
🔴రాహుల్ గాంధీ రాజీనామా నే అసలు సమస్య :
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడటంతో.. నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. హస్తం పార్టీ గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉందని, రాచరికాన్ని కొనసాగిస్తోందని బీజేపీ విమర్శిస్తోండటంతో.. ఈసారి అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబానికి చెందిన వారికి కాకుండా వేరే వారికి అప్పగించాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు.
🔴వందలాది మంది కాంగ్రెస్ నాయకుల రాజీనామా :
రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. కానీ రాహుల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. 👉సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్‌లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు. 👉ఓ దశలో యువనేతలు సచిన్ పైలెట్, జ్యోతిరాధిత్య సింధియా పేర్లు పరిశీలనకి వచ్చాయి.
పార్టీకి దిశానిర్దేశం చేసే అధ్యక్ష పదవిపై గందరగోళం నెలకొనడంతో.. కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పే అవకాశం లేకపోయింది.
🔴 ఆర్టికల్ 370 రద్దు తర్వాత :
కాంగ్రెస్ నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెల్లడించారు. కశ్మీరీ నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ అభిప్రాయంగా జనాల్లోకి వెళ్లింది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉండటంతో.. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా నివాసంలో భేటీ అవుతున్నారు.
సీడబ్ల్యూసీ అధ్యక్షుడిని త్వరలో అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.