కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఉ. 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్ల లెక్కిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ హాల్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద 100 మీటర్ల దూరం నుంచి ఎవరైనా నడిచి వెళ్లాల్సిందేనన్నారు.
రాష్ట్రంలో కౌంటింగ్ కోసం 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే 45 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కౌంటింగ్ వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి పక్కా ట్రైనింగ్ ఇచ్చినట్లు స్పష్టంచేశారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు.
2.11 లక్షల పోస్టల్ బ్యాలెట్, 28వేల సర్వీస్ ఓట్లు వచ్చాయని వెల్లడించారు. 3.05లక్షల పోస్టల్ బ్యాలెట్‌లు జారీ చేశామని స్పష్టంచేశారు. రేపు(గురువారం) ఉదయం వరకు బ్యాలెట్‌లు ఆర్వోలకు చేరొచ్చన్నారు. 8గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారని చెప్పారు. ప్రతీ అసెంబ్లీకి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌కి ఒక పరిశీలకుడు అందుబాటులో ఉన్నారన్నారు. హాల్ సామర్థ్యం ఆధారంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారని వివరించారు. ప్రతి రౌండ్ వారీగా ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటర్ ఉంటుందన్నారు. 25వేల మంది కౌంటింగ్ సిబ్బంది, 25 వేల మంది సాయుధ బలగాలు కౌంటింగ్ విధుల్లో ఉంటారని తెలిపారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుకు కొంత ఆలస్యం అవుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్లు.. కౌంటింగ్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రశాంతంగా కౌంటింగ్ జరిపేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, లోక్‌సభలకు వేర్వేరుగా వీవీప్యాట్‌ల లాటరీలో ఎంపిక చేస్తామన్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపు వెరిఫికేషన్ కోసం మాత్రమేనన్నారు. ఏదైనా ఈవీఎం మొరాయిస్తే వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాలన్నారు. కౌంటింగ్ తర్వాత రీపోలింగ్ అసాధ్యమన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.