అమరావతి పై ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు

Finance Minister's comments on Amravati
Spread the love

Teluguwonders:

అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం విషయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

💥కలకలం రేపుతున్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు:

రాజధాని నిర్మాణంపై అధికార, విపక్షల మధ్య సాగుతోన్న మాటల యుద్ధానికి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆజ్యం పోసేవిలా ఉన్నాయి. అమరావతిపై తీవ్రంగా చర్చ సాగుతోన్న వేళ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి.

🔴వివరాల్లోకి వెళ్తే :

సింగ్‌పూర్‌లో జరుగుతోన్న భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు రాష్ట్రం తరఫున బుగ్గన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ది స్టెయిట్స్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

రాజధానిఅమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధుల్లేవని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని, ఒక నగరానికే పరిమితం చేయడం కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అందరికీ సుస్థిర జీవనం, అన్నిచోట్లా ఉత్పాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ ప్రాధమ్యాలని మంత్రి బుగ్గన తేల్చి చెప్పారు. అమరావతిలో ఎకనమిక్ సిటీ అభివృద్ధికే సింగపూర్‌ సంస్థలు పరిమితమని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించామని మంత్రి వివరించారు.

అయితే, అమరావతిని తాము విస్మరించలేదని, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలలు పడుతుందన్నారు. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయడం, వికేంద్రీకరించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు సీఎం అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీవీ రమేశ్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌, ఇతర ఉన్నాధికారులు పాల్గొన్నారు.

🔴సింగపూర్‌ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ :

సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ సదస్సులో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు మాత్రమే పూర్తయిందని, అమరావతి నిర్మాణంపై పెట్టుబడిదారులకు పంపుతున్న సంకేతాలను అది నిర్ధారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ప్రాజెక్టు భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఉద్ఘాటించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం తన ప్రాధామ్యాలను మార్చుకుంటున్నపుడు దీనికి అనుగుణంగా కాంట్రాక్టర్లు ఆయా ప్రాజెక్టుల్లో కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారని తెలిపారు. పెట్టుబడుదారులకు తమ దేశం అనుకూలమైన వాతావరణం సృష్టించడం వల్లే ఆర్థికవృద్ధి వేగవంతంగా ఉందని అన్నారు.

👉ప్రభుత్వం ఆసక్తిగా ఉందని :

ఈ వాణిజ్య సదస్సులో ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించిన ప్రతినిధులు.. అభివృద్ధిలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, నాలుగు నౌకాశ్రయాలు, ఆక్వా, ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading