పల్నాడులో హైటెన్షన్ ‘చలో ఆత్మకూరు’.. టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ

high tension in Palnadu
Spread the love

Teluguwonders:

పల్నాడు రాజకీయం పునరావాస శిబిరాలతో హీటెక్కింది. ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతులు నిరాకరించినా వెళ్లి తీరాల్సిందేనని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ నెలకొంది.

💥 ఛలో ఆత్మకూరు:

11న టీడీపీ చలో ఆత్మకూరు ప్లాన్ చేస్తే పోటీగా వైఎస్సార్సీపీ కూడా అదే రోజు పర్యటనప్లాన్ చెయ్యడం తో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతున్నది.

👉వివరాల్లోకి వెళ్తే :

చంద్రబాబు ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున హాజరవ్వాలని కోరారు.

చంద్రబాబు తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’కు పోలీసులు అనుమతులు నిరాకరించారు. పల్నాడులో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని, అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల అనుమతి నిరాకరణపై చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేతలతో మంగళవారం సమావేశమై చర్చించారు. అనుమతులు నిరాకరించినా చలో ఆత్మకూరు చేసి తీరాలని నిర్ణయానికి వచ్చారు.

💥‘చలో ఆత్మకూరు’ఎందుకంటే :

పల్నాడులో టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, గ్రామాల్లోకి కూడా రానీయండం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ బాధితుల కోసం గుంటూరులో పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది.

🔴పోటీగా వైఎస్సార్సీపీ కూడా :

మరోవైపు అధికార వైఎస్సార్సీపీ కూడా అదే రోజున చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. గుంటూరులో మంగళవారం సమావేశమైన ఆ పార్టీ నేతలు టీడీపీ బాధితులతో ఆత్మకూరుకు వెళ్లనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు అనుమతులు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని టీడీపీ బాధితులందరూ బుధవారం ఉదయం గుంటూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి చలో ఆత్మకూరు ప్రారంభమవుతుందన్నారు. గత ఐదేళ్లలో ఏం జరిగిందనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..టీడీపీ కి పోటీగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ బాధితుల పునరావాస శిబిరం నిర్వహించారు.

తాజాగా వైఎస్సార్సీపీ కూడా పోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టనుండడంతో పల్నాడులో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ పోటాపోటీగా ఆత్మకూరు పర్యటనకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులను భారీగా మోహరించారు. టీడీపీకి అనుమతి ఇవ్వని పోలీసు శాఖ అధికార పార్టీకి ఇస్తుందో లేదో వేచి చూడాలి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading