కాశ్మీర్ కి కొత్త గవర్నర్ గా.. ఆ ips

Ips as the new governor of Kashmir
Spread the love

Teluguwonders:

1975 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ను జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. కశ్మీర్‌కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

మరోవైపు విజయ్ కుమార్‌తో పాటు ఐపీఎస్ దినేశ్వర్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొద్దిరోజుల క్రిందట తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపుతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.

🦁విజయ్ కుమార్ ఐపిఎస్ :

ఆయన కెరీర్ చూస్తే ఆయన ట్రిగ్గర్ మీద నుంచి వేలెపుడైనా తీశాడా అని అనుమానం వస్తుంది. ఆయన కన్నుపడితే ఫినిషే. అదే విధంగా ఆయన మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు కూడా ఉన్నాయి. హక్కులసంఘాల వాళ్లు చేస్తున్న ఆరోపణలకు రిప్లైగా ఆయన ఓ డైలాగ్ వదిలారు. “పోలీసు చేతిలో గన్ ఉండేది కాల్చేందుకే గాని అభరణంగా కాదు (Policemen do not carry guns as ornaments) అని.విజయ్ కుమార్ 100 శాతం పోలీసని ఈ డైలాగుతో అర్థమవుతుంది. హక్కుల సంఘాల వాళ్లు ఆరోపించినపుడు ఆయన ఈ సంచలన వ్యాఖ్య చేశారు.

🔴స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన రికార్డు :

1975 తమిళనాడు బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ 2004 అక్టోబర్‌లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా.. ఇక 2018లో జమ్మూకాశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుడిగా పని చేశారు.

ఎన్ కౌంటర్ల స్పెషలిస్టుగా పేరున్న విజయకుమార్ 370 రద్దు తర్వాత ఏర్పడిన ఉద్రిక్త కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా సరౌన వ్యక్తి అని భావించిఆయన కుప్రమోషన్ ఇస్తున్నట్లు సమాచారం.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ గా తెలంగాణ గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ను నియమిస్తున్నారని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. అయితే, ఈ పదవి రేసులో విజయ్ కుమార్ ముందున్నారని చెబుతారు. నరసింహన్ కూడా ఐపిఎస్సే.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading