అవినీతి రహిత సమాజం కోసం పోరాడనున్న జగన్…

jagan
Spread the love

teluguwonders:

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వేగంతో పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం మొదటిసారిగా ఎక్కినా ఎక్కడ అలా కనిపించడం లేదు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వారిలముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆయన అంతేకాదు ప్రభుత్వాన్ని సంబంధించి ఏ రంగంలోనూ అవినీతికి తావు లేకుండా పని చేయాలని ఆయన గట్టిగా ఆదేశాలను ఇస్తున్నారు.
తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు.                                               ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధానసలహాదారు అజేయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యాలయ కార్యదర్శిధనుంజయ్ రెడ్డి, ఇంజినీర్ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరరావు, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..మొదట ప్రాజెక్టు లతో పాటు గృహ నిర్మాణంలో అవినీతిని వెలికితీయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిపుణుల కమిటీ ని
ఆదేశించారు.

🔴తొలుత పోలవరం ప్రాజెక్టు పై:

సాగునీటిప్రాజెక్టులలోచేసుకున్నకుంభకోణాలన్నీబయటపెట్టాలన్నారు.తొలుతపోలవరం, ఆ తర్వాత హంద్రీనీవా,గాలేరునగర్,వంశధార తదితర ప్రాజెక్టుల, నిర్మాణాల్లో అవకతవకలను వెలికి తీయాలి అని ముఖ్యమంత్రి పేర్న్నారు.

🔴అవినీతిని కడిగేయాలని :

గతప్రభుత్వంలప్రత్యేకంగఏర్పాటుచేసుకున్నఅధికారులు,ఉద్యోగులుప్రజాధనాన్నిదర్వినియోగంచేశారని,ఆవ్యవహారాలుమొత్తంవెలికితీయాలన్నారు.గతప్రభుత్వహయాంలోఆంధ్రప్రదేశ్, దేశంమొత్తంమీదఅవినీతి లో మొదటి స్థానంలోకి వచ్చిందని , దీన్ని ఇలాగే వదిలేసే ప్రసక్తేలేదనిముఖ్యమంత్రిస్పష్టం చేశారు.పోలవరంతనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా ఆయన స్పష్టం చేశారు.

🔴గృహనిర్మాణంలోనూ అవినీతి :

గృహ నిర్మాణ రంగంలోనూ అవినీతి జరిగిందని ముఖ్యమంత్రిజగన్ ఈ సమావేశంలోప్రస్తావించారు. పట్టణ గృహ నిర్మాణంలోచిన్న ప్లాన్ రూ.6 లక్షలకు పేదలకుఇస్తున్నారనిఆయన అన్నారు.

దీని వల్ల ఇళ్లు కొన్వారు 20 ఏళ్లపాటు రుణం భరించవలసిన పరిస్థితిఉందన్నారు.చదరపు గజం నిర్మాణానికి రూ.1,000 నుంచి రూ.1,100 వరకుఅయ్యేదానికి గత ప్రభుత్వం రూ. 2,200 ఖర్చు చేసిందని, తమప్రభుత్వం లో అవినీతి కి తావు లేదని, టెండర్ల విధానాన్ని అత్యంతపారదర్శకంగా రూపొందించాలని సీఎం అన్నారు. దీనికోసంరెండు రకాలు విధానాలు అనుసరిస్తున్నామని చెప్పారు.

👉 జ్యుడీషిఎల్ కమిషన్ ను ఏర్పాటు చేసి టెండర్లను అత్యంత పారదర్శకంగా నిర్ణయించేపద్ధతి కోసం ఇప్పటికే హైకోర్టుప్రధానన్యాయమూర్తిఅడిగానని అన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా గతంలో ఆమోదించినప్రాజెక్టుకు సంబంధించిఏమేరకు ఖర్చు తగ్గించగలమో ఆమేరకు రివర్స్ టెండర్ల ద్వారాతగ్గిస్తామన్నారు.ఈ విధమైన ప్రణాళిక ప్రకారం నిర్మాణ రంగంలో అవినీతిని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading