Teluguwonders:
Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు
జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు .
🔴ప్రజలకు అండగా నిలబడాలి:
గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు
పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చిన జనసేన అండగా నిలబడాలని పిలుపునిచ్చారు అధినేత పవన్ కళ్యాణ్. నిరంతరం ప్రజల పక్షాన నిలిచేది జనసేవ పార్టీయేనని.. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపై ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల వరకూ ఏమీ మాట్లాడకూడదని అనుకున్నామని.. కానీ పాలన విధానం మరోలా ఉందన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నామని.. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇకపై పార్టీ నేతలు, జనసైనికులు ప్రజలకు అండగా నిలవాలని.. ప్రతి అంశంపై సాధికారతతో మాట్లాడదామన్నారు. ఇందుకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారితో చర్చిస్తూ.. ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
👉నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ :
జనసేన పార్టీ విధి విధానాలు, పార్టీ భావజాలం, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉందన్నారు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అధినేత ఆలోచనలకు అనుగుణంగా నడచుకోవాలని.. ప్రజలతో మమేకం కావాలన్నారు. పాలన ఎలా ఉంది.. పథకాల అమలు, నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా సంక్షేమ ఫలాలు చేరుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ పార్టీ బలోపేతానికి అవసరమైన ప్రణాళికలను అధినేత సిద్ధం చేసినట్లు తెలిపారు .పార్టీపైనా, నాయకుడిపైన అసత్య ప్రచారాలకు పాల్పడితే బలంగా తిప్పికొట్టాలన్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.